స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలి
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:32 PM
రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీదే పైచేయి కావాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్ అన్నారు.
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్
జన్నారం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీదే పైచేయి కావాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్ అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై మండల కేంద్రానికి మొదటిసారి రావడంతో ఆదివారం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, రాబోయే కాలంలో కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుందన్నారు. రానున్న స్థానిక సంస్థల్లో ప్రతి కార్యకర్త సైనికుడి వలే పనిచేసి బీజేపీని గడపగడపకు తీసుకెళ్లాలన్నారు. అనంతరం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా వెనుకబడి పోతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆచరణకు నోచుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఇన్‌చార్జి రితీష్‌రాథోడ్, మండల అధ్యక్షుడు మధుసూదన్‌రావు, నాయకులు శంకరయ్య, రమేష్‌గౌడ్, బద్రినా యక్, ప్రహల్లాద్, రమేష్, దస్తూరాబాద్, కడెం, ఖానాపూర్, ఊట్నూరు మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీలో పలువురి చేరికలు
కాసిపేట, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవాపూర్‌లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, మైనార్టీ నాయకులు 50 మంది ఆదివారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాధ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. ఓరియంట్‌సిమెంట్ కంపెనీ కార్మికులు, మైనార్టీ యువకులు, నాయకులు బీజేపీ పార్టీలోచేరడంతో పార్టీ బలపడిందని రఘునాధ్ తెలిపారు.పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతం కృషి చేయాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడునగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, మండల అద్యక్షుడు సూరం సంపత్‌కుమార్, నాయకులు పోశన్న, సంతోష్, కిరణ్, రమేష్, మహేష్, పర్వతాలు, రమేష్, హనీఫ్, హరీఫ్,గౌస్,జమీర్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.