Share News

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - Jul 16 , 2025 | 11:34 PM

ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని లక్షెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయికిరణ్‌ కాసమల అన్నారు.

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చట్టాలపై అవగాహన కల్పిస్తున్న జడ్జి సాయికిరణ్‌

లక్షెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయికిరణ్‌

లక్షెట్టిపేట, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని లక్షెట్టిపేట జూనియర్‌ సివిల్‌ జడ్జి సాయికిరణ్‌ కాసమల అన్నారు. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ఎంపీడీవో మీటింగ్‌ హాలులో అంగన్‌వాడీ కార్యకర్తలకు న్యాయ విజ్ఞానసదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిఽథి గా జూనియర్‌ సివిల్‌ జడ్జి హాజరై మాట్లాడారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటిపరిష్కారంతో పాటు వాటికి సంబంధించిన చట్టాల పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. అంతకు ముందు అధి కారులు జూనియర్‌ సివిల్‌ జడ్జిని సన్మానించారు. కార్యక్రమంలో పీడీ రౌఫ్‌ఖాన్‌, సీడీపీవోరేష్మా, ఎంపీడీవో సరోజ, బార్‌ అసోసి యేషన్‌ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న, న్యాయవాదులు, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 11:35 PM