Share News

జనావాసాల నుంచి డంప్‌యార్డును తరలించండి

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:10 AM

సీసీసీలోని జనావాసాల మధ్య ఉన్న డంప్‌యార్డును అక్కడి నుంచి తరలించాలని సింగరేణి ఉద్యోగులు ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సుర్మిళ్ల వేణుకు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగుల క్వా ర్లర్ట మధ్యలోని ముక్కిడి పోచమ్మ ఆలయం వెనుకవైపు డంప్‌యార్డు ఉండడంతో తీవ్ర దుర్గంధం వస్తోం దని, తరచుగా చెత్తను తగులబెట్టడంతో పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని తెలిపారు.

జనావాసాల నుంచి డంప్‌యార్డును తరలించండి
మాజీ మున్సిపల్‌ చైర్మన్‌కు వినతిపత్రం ఇస్తున్న సింగరేణి ఉద్యోగులు

శ్రీరాంపూర్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి): సీసీసీలోని జనావాసాల మధ్య ఉన్న డంప్‌యార్డును అక్కడి నుంచి తరలించాలని సింగరేణి ఉద్యోగులు ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ సుర్మిళ్ల వేణుకు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగుల క్వా ర్లర్ట మధ్యలోని ముక్కిడి పోచమ్మ ఆలయం వెనుకవైపు డంప్‌యార్డు ఉండడంతో తీవ్ర దుర్గంధం వస్తోం దని, తరచుగా చెత్తను తగులబెట్టడంతో పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని తెలిపారు. పది కిలోమీటర్ల పరిధిలో ఇళ్లల్లో నివాసం ఉండేవారికి శ్వాసకోస వ్యాధులు వస్తున్నాయని, అస్తమా ఉన్న వారు గాలి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌కే-5 కాలనీ, టీచర్స్‌ కాలనీ, సీసీసీ టౌన్‌షిప్‌, శ్రీరాంపూర్‌ కాలనీ, నస్పూర్‌ కాలనీ, బి-టౌప్‌ క్వార్టర్లు, బంగ్లాస్‌ ఏరియా, ఆర్‌కే-8 కాలనీ క్వార్టర్స్‌, ఇతర కార్మిక నివాసం ప్రాంతాలలో తీవ్ర ప్రభావం చూపుతున్నదని వివరించారు.

Updated Date - Mar 12 , 2025 | 12:10 AM