Share News

హైదరాబాద్‌కే పరిమితమైన ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:22 PM

మంచిర్యాల జిల్లా లోని ముగ్గురు ఎమ్మెల్యేలు సమస్యలను గాలికి ఒదిలేసి హైద రాబాద్‌లో ఉంటున్నారని, వారికి పంచాయతీ ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్‌ వెరబెల్లి పేర్కొన్నారు.

 హైదరాబాద్‌కే పరిమితమైన ఎమ్మెల్యేలు
తాండూర్‌లో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్‌ వెరబెల్లి

- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్‌ వెరబెల్లి

తాండూర్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా లోని ముగ్గురు ఎమ్మెల్యేలు సమస్యలను గాలికి ఒదిలేసి హైద రాబాద్‌లో ఉంటున్నారని, వారికి పంచాయతీ ఎన్నికల్లో తగిన బుద్ధిచెప్పాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్‌ వెరబెల్లి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలో పేరు మీద హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పబోతున్నారని, బీజేపీ అభ్యర్ధులను సర్పంచుగా గెలిపించబోతున్నారన్నారు. బీజేపీతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వారి అనుచరులు భూములు కబ్జా చేస్తూ అమ్ము కుంటూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం అచ్చ లాపూర్‌ గ్రామంలో బీజేపీ బలపరిచిన అధ్యర్థి తరుపున ప్రచారం నిర్వహించారు. సమావేశంలో మండల అధ్యక్షుడు దూడ పాక భరత్‌కుమార్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ, నాయకులు కృష్ణమూర్తి, మహీధర్‌గౌడ్‌, చిలుముల శ్రీకృష్ణదేవ రాయలు, చిలువేరు శేషగిరి, పులగం తిరుపతి, తిరుపతి, ఈశ్వ రి, విగ్నేష్‌, కుమార్‌, రాజేశం, ప్రదీప్‌, నాగభూషణ్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 11:23 PM