Share News

మంత్రి ‘పొంగులేటి’ పర్యటనను విజయవంతం చేయాలి

ABN , Publish Date - May 19 , 2025 | 11:21 PM

ప్రభుత్వం చేపట్టిన భూభారతి నూతన ఓఆర్‌ఓ చట్టం -2025లో భాగంగా జిల్లాకు వస్తున్న రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటనను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు.

మంత్రి ‘పొంగులేటి’ పర్యటనను విజయవంతం చేయాలి
అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

- కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన భూభారతి నూతన ఓఆర్‌ఓ చట్టం -2025లో భాగంగా జిల్లాకు వస్తున్న రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటనను అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. సోమవారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమం సంబందించిన ఏర్పాట్లను జిల్లా గ్రామీణాబివృద్ద్ధి అఽధికారి కిషన్‌, తహసీల్దార్‌ సదానందం, ప్రత్యేక తహసీల్దార్‌ వనజరెడ్డిలతో కలిసి పరిశీలించారు. అనంతరం జైపూర్‌ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్‌ ప్లాంట్‌లోని హెలీప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో సంబంధిత అదికారులు పాల్గొన్నారు.

భీమారం (ఆంధ్రజ్యోతి) : భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి మంగళవారం భీమారంకు రానుండగా సోమవారం ఏర్పాట్లను డీసీపీ భాస్కర్‌, ఏసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. సభ కోసం భీమారంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ వేణు చందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 19 , 2025 | 11:21 PM