Share News

మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:40 PM

జిల్లాలోని హాజీపూర్‌ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్యకళాశాల భవన నిర్మాణ పనులు మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు.

మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి
మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

హాజీపూర్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని హాజీపూర్‌ మండలం గుడిపేటలో చేపట్టిన ప్రభుత్వ వైద్యకళాశాల భవన నిర్మాణ పనులు మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. బుధవారం మెడికల్‌ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు మరింత వేగవంతమైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలి పారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకరావాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీ ల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూభారతి రెవెన్యూసదస్సుల్లో వచ్చిన దరఖా స్తులను రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జాతీయ రహదారి 63 నిర్వహణలో భాగంగా భూసేకరణ కార్యక్రమానికి సంబంధించి అవార్డు జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.

జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు ఉన్నాయని, పంట సాగుకు అనుగుణంగా యూరియా, ఎరువులు పంపిణీ చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. బుధవారం కలెక్టర్‌ చాంబర్‌లో వ్యవ సాయాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా లో యూరియా, ఎరువు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. సకాలంలో రైతులకు కార్యచరణ ప్రకారం అందించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయి లో పర్యటించి ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేయాలన్నారు. కాలానికి అనుగుణంగా రైతులు సాగు చేయాల్సిన పంటల వివరాలు, సాగు మెళకు వల గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,560 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం ఉందని, 1,600 మెట్రిక్‌ టన్నులు అందించడం జరిగిందన్నారు. జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, సహకార శాఖ అధికారి బిక్కు, వ్యవసాయాధికా రులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 11:40 PM