‘అమ్మకు అక్షరమాల’ను విజయవంతం చేయండి
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:19 PM
అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి అజ్మీర పురుషోత్తం పేర్కొన్నారు.
జైపూర్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి అజ్మీర పురుషోత్తం పేర్కొన్నారు. బుధవారం ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఓబీ, వీవోఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించి వారికి చదువు నేర్పించడానికి వలంటరీ టీచర్లను గుర్తించి ఉల్లాస్ యాప్‌లో నమోదు చేశామన్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామసంఘం నుంచి ఇద్దరు ఓబీలకు, వీవోఏలకు రాష్ట్రస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఓబీలకు, వీవోఏలకు ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అనిత, మండల సమాఖ్య అధ్యక్షురాలు మాలతి తదితరులు పాల్గొన్నారు.