మిగిలిన మద్యం దుకాణాలకు లక్కీడ్రా
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:23 PM
జిల్లాలో 2025-27కు సంబంధించిన మిగిలిన ఏడు మద్యం దుకాణాలకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలోని మినీ సమావేశ మందిరంలో లక్కీడ్రా నిర్వహించారు.
ఆసిఫాబాద్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2025-27కు సంబంధించిన మిగిలిన ఏడు మద్యం దుకాణాలకు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలోని మినీ సమావేశ మందిరంలో లక్కీడ్రా నిర్వహించారు. కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి జ్యోతికిరణ్‌తో కలిసి లక్కీడ్రా చేశారు. జిల్లాలో 32 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పటికే 25 దుకాణాలకు లక్కీడ్రా నిర్వహించారు. మిగిలిన దుకాణాలను తక్కువ ధరఖాస్తులు రావడంతో తిరిగి దరఖాస్తులు తీసుకున్నారు. గత నెల 26 నుంచి నవంబరు 1 వరకు దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 92 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో షాపు నంబర్ 9(రెబ్బెన)కు 20 దరఖాస్తులు, షాపు నంబర్ 10(గోలేటి)కి తొమ్మిది దరఖాస్తులు, షాపు నంబర్ 14(కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్)కు 17, షాపు నంబర్ 22 (రవీంద్రనగర్) 14 దరఖాస్తులు, షాపు నంబర్ 30(జైనూరు)కు 11, షాపు నంబర్ .31(జైనూరు) 12, షాపు నంబర్ 32(సిర్పూర్-యూ) తొమ్మిది దరఖాస్తులు వచ్చాయి. ఈ దుకాణాలకు దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీడ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడుతూ మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ లక్కీ పద్ధతి పూర్తి పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు.
లక్కీ విజేతలు వీరే:
జిల్లాలో ఏడు మద్యం దుకాణాలకు నిర్వహించిన లక్కీడ్రాలో దుకాణాలు దక్కించుకొన్న విజేతలుగా నిలిచారు. ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని షాపు నంబర్ 9కి మహేష్, షాపు నంబర్ 10కి శివమణి, షాపు నంబర్ 30కి శ్రీనాథ్, షాపు నంబర్ .31కి యశ్వంత్‌రావు, షాపు నంబర్ 32కు ఆత్రం నాగోరావు, కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని షాపు నంబర్14కు ఇంద్రనాథ్, షాపు నంబర్ 22కు శ్రీనివాస్‌గౌడ్ విజేతలుగా నిలిచారు. కాగా 9, 10, 14లకు వరుసగా టెకెన్ నంబర్ 1లో అదృష్టం వరించింది.