దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఏకం కావాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:19 PM
దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్య్టా వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.
- మోదీ పాలనలో పెట్టుబడిదారులకే పెద్దపీట
- సింగరేణి మనుగడ కోసం కృషి
- మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
మందమర్రిటౌన్/బెల్లంపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): దేశంలో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్య్టా వామపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్‌లో ప్రారంభ మైన సీపీఐ బస్సు జాతా శనివారం రాత్రి మందమర్రి, బెల్లంపల్లి పట్టణాలకు చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. పాలక వర్గాలు అనుసరిస్తున్న విధానాలు ప్రజలకు పెను శాపంలా మారాయన్నారు. తమ పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా పార్టీ పుట్టుక, చేసిన పోరాటాలు, సాధించిన హక్కులను వివరిస్తున్నామన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వల్ల జరుగుతున్న నష్టాలను ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ కేవలం ఆదాని, అంబానీలకు పెద్దపీట వేస్తూ జాతీయ పరిశ్రమలను పట్టించుకోవడం లేదని, కార్పొరేట్ కంపెనీలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఇప్పటికే మూడుసార్లు అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వంలో దేశం పరిస్థితి ఇంకా దిగజారిపోయిం దన్నారు. భూమి కోసం భుక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రాణత్యాగం చేశారని, మూడు వేల గ్రామాలను విముక్తి చేసి పది లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర తమదేనని తెలిపారు. తెలంగాణలో తలమానికమైన సింగరేణి సంస్థను పరిరక్షించేం దుకు సమరశీల పోరాటాలకు సిద్ధమవుతున్నామ న్నారు. ఎన్నికైన తమ సంఘానికి ఎలాంటి సమాచారం లేకుండా ఉద్యోగ వ్యతిరేక సర్క్యూలర్లను యాజమాన్యం జారీ చేస్తుంద న్నారు. సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. తాము అధికారంలోకి వస్తే సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ ఎన్ని ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బెల్లంపల్లి పట్టణంలోని భగత్‌సింగ్ విగ్రహానికి నాయకు లతో కలిసి చాడ వెంకటరెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్య క్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు కలవేన శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, నాయకులు మారుపాక అనిల్‌కు మార్, శ్రీనివాసరావు, సలేంద్ర సత్యనారాయణ, దుర్గరాజ్, కంది శ్రీని వాస్, ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, రమణరావు, రాజేశ్వర్‌రావు, వినోద్, చిప్పనర్స య్య, రాజమౌళి, చంద్రశేఖర్, తదితరులు రాజేశ్ పాల్గొన్నారు.
తాండూర్: సీపీఐ చేపట్టిన బస్సు జాతా తాండూర్‌కు చేరుకోగా సీపీఐ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు మణికంఠరెడ్డి, లక్ష్మణ్, దాసు, చంద్రశేఖర్, రవి, బానేష్, సంతోష్, ప్రహ్లాద్, సత్యనారాయణ, భీమేష్, శ్రీనివాస్, సన్యాసి పాల్గొన్నారు.