Share News

ఆగస్టు 15లోపు భూ సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:42 PM

భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాఇలో పరిశీలించి ఆగస్టు 15 నాటికి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఆగస్టు 15లోపు భూ సమస్యలు పరిష్కరించాలి
వీసీలో పాల్గొన్న అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్ద శుక్లా

- రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

ఆసిఫాబాద్‌, జూలై 22(ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాఇలో పరిశీలించి ఆగస్టు 15 నాటికి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావుతో కలిసి వసతి గృహాలు, విద్యార్థుల ఆరోగ్యం, భూ భారతి చట్టంలో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలన, ఇందిరమ్మ ఇళ్ల పనుల వేగవంతం, వనమహోత్సవం తదితర అంశాలపై వీసీ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ భూ భారతి చట్టంలో భాగంగా నిర్వహించి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించి అర్హులైన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ద శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి హాజరయ్యారు.

వీసీ అనంతరం అదనపు కలెక్టర్లు జిల్లా అధికారులతో మాట్లాడుతూ అధికారులు, ప్రత్యేకాధికారులు తమ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత పాటించేలా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతంగా జరిగే చర్యలు తీసుకోవాలని, వన మహోత్సవంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు రేషన్‌ కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రంమలో అటవీ డివిజన్‌ అధికారి దేవిదాస్‌, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, మైనార్టీ సంక్షేమాధికారి నదీమ్‌, హౌజింగ్‌ పీడీ వేణుగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:42 PM