తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన కేసీఆర్
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:02 AM
తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష చేపట్టడంతో పాటు విద్యార్థుల ఆత్మబలిదానాలు, ప్రజా పోరాటాలతో తెలంగాణ స్వరాష్ట్ర కళ సాకారమైందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు.
- బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
మందమర్రిటౌన్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష చేపట్టడంతో పాటు విద్యార్థుల ఆత్మబలిదానాలు, ప్రజా పోరాటాలతో తెలంగాణ స్వరాష్ట్ర కళ సాకారమైందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలిపారు. మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ విజయ్‌దివస్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆధ్వర్యంలో దీక్షా విజయ్ దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పెంట రాజయ్య, నాయకులు గాదె సత్యం, అంకం నరేష్, ఎండీ మహమూద్, సింగిల్ విండో చైర్మన్ సందెల వెంకటేష్ పాల్గొన్నారు.
చెన్నూరు: తెలంగాణ రాష్ట్ర ప్రకటన దినోత్సవాన్ని పురస్కరిం చుకుని మంగళవారం చెన్నూరు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి: కేసీఆర్ ఆమరణ దీక్షతోనే కేంద్రం దిగివచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించిందని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం దీక్ష విజయ్ దివస్ వేడుకలను బీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, సబ్బని అరుణ్, నూనె సత్యనారాయణ, మద్దెల గోపి, పాల్గొన్నారు.