జాబ్‌మేళాతో ఉద్యోగ అవకాశాలు
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:43 PM
పట్టణంలోని ఏఎంసీ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళాతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఏఎంసీ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళాతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగా మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నా మని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ యువత కోసం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్‌మేళా నిర్వహిస్తుందన్నారు. ఈ జాబ్‌మేళా లలో దాదాపు 75 కంపెనీలకు పైగా పాల్గొంటాయని నాలుగువేలకు పైగా ఉద్యోగాలు ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు బయోడెటాతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు తమ వెంట తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మనోజ్, జీఎం రాధాక్రిష్ణ పాల్గొన్నారు.