Share News

అటవీ శాఖలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:39 PM

కెరమెరి అటవీ రేంజ్‌ పరిధిలో ఆదివాసు లకు, బడుగు, బలహీనవర్గాల వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదివా సీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

అటవీ శాఖలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి
మాట్లాడుతున్న తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌

కెరమెరి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): కెరమెరి అటవీ రేంజ్‌ పరిధిలో ఆదివాసు లకు, బడుగు, బలహీనవర్గాల వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదివా సీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కెరమెరి ఎఫ్‌ఆర్వో మజీరోద్దీన్‌ కేవలం ఒకే సామాజిక వర్గం వారికి ఉపాధి అవకాశాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది నిరుద్యోగులు ఆదివాసీ యువత ఉపాధి లేక చదువుకొని కూలి పనిచేస్తే ఖాళీగా ఉన్నారన్నారు. ఇదే ఏజెన్సీ ప్రాంతంలో అటవీ రేంజ్‌ కార్యాలయం లో ఉపాధి దొరుకుతుందని అనుకుం టే ఒకే సామాజిక వర్గం వారితో భర్తీ చేయడంతో ఆదివాసీ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారన్నారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ నాయకు లు ప్రభాకర్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకు లు వెంకటేష్‌, కొలాం సంఘం నాయకులు మారుతి, లక్ష్మణ్‌, బాపురావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:39 PM