జీవో నంబర్ 49ను వెంటనే రద్దు చేయాలి
ABN , Publish Date - Jun 16 , 2025 | 11:38 PM
టైగర్ కన్జర్వేషన్ రిజర్వు ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నంబర్ 49ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేయాలని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు డిమాండ్ చేశారు.
సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు
ఆసిఫాబాద్‌రూరల్, జూన్ 16 (ఆంధ్రజ్యో తి): టైగర్ కన్జర్వేషన్ రిజర్వు ఏర్పాటు కోసం జారీ చేసిన జీవో నంబర్ 49ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేయాలని సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు డిమాండ్ చేశారు. గిరిజనుల కు, గిరిజనేతరులకు నష్టం వాటిల్లే జీవో నంబర్ 49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట పార్టీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, సీనియర్ నాయ కులు అరిగెల నాగేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌తో కలిసి జీవో ప్రతులను దహనం చేశారు. అనంతరం మీడియా సమా వేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎలాంటి సంప్ర దింపులు లేకుండా ఏక పక్షంగా ప్రజాప్రతినిధు లకు సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 49ను తీసుకు వచ్చి జిల్లాలోని గిరిజనులకు, గిరిజనేతరులకు, రైతులుకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ఆసిఫాబా ద్, సిర్పూర్ నియోజక వర్గాల్లో సుమారు నాలుగు లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించ డంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందన్నా రు. ఇప్పటికైనా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లకు కనీసం మరమ్మతులు కరువయ్యాయని, కన్జర్వేషన్ రిజ ర్వు పేరిట అటవీ అనుమతులు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. జీవో నంబర్ 49పై ఆదివాసులు ఆందోళన చేస్తుంటే గిరిజన మంత్రి సీతక్క సంప్రదించకపోవడం అన్యాయమన్నారు. జీవో నంబర్ 49ను ప్రభుత్వం రద్దు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు మురళీధర్, దీపక్ పంచధార, ప్రహ్దా్, జయరాజ్, శ్రావ ణ్, ప్రసాద్‌గౌడ్, వెంకన్న పాల్గొన్నారు.
- టైగర్ జోన్ రద్దు చేయాలి..
చింతలమానేపల్లి/దహెగాం/కౌటాల: జిల్లా ను టైగర్ జోన్‌గా ప్రకటిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 49ను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు చింతలమానేపల్లి, దహెగాం, కౌటాల మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాల యాల్లో బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకు లు రామన్న, మల్లయ్య, తుకారాం, మురళీ, మోహన్, తిరుపతిగౌడ్ దామోదర్, ధనుంజ య్, రాకేష్, బాపు, సత్యనారాయణ, సంజీవ్, తిరుపతి, గంగాధర్, ప్రదీప్, విజయ్, మోతి రాం, మధుకర్, నరేష్, శంకర్, శ్రీను, సోమయ్య, మహేష్, తిరుపతి, వెంకటేష్, రవీందర్, కిష్టయ్య, నగేష్, మధు, లక్ష్మి, బయక్క, తదితరు లు పాల్గొన్నారు.