Share News

వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన

ABN , Publish Date - Oct 30 , 2025 | 11:07 PM

మందమర్రి మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ గురువారం పరిశీలించారు.

వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన
రైతులతో మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ

మందమర్రిరూరల్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మందమర్రి మండలంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాలకు నేలకొరిగిన వరి పొలాల నుంచి నీటిని పూర్తిగా తొలగించా లని, వరికొయ్యలను నిటారుగా లేపి కుచ్చులుగా కట్టుకోవాలని సూచించారు. ఇలా చేయడం వల్ల తెగుళ్లు ఆశించకుండా ధాన్యం నాణ్యతను కాపాడుకోవచ్చన్నారు. పంటల నష్టాన్ని సర్వే చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని పేర్కొన్నారు. పత్తి రైతులు కపాస్‌ కిసాన్‌ యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని స్లాట్‌ బుక్‌చేసుకుని పత్తిని విక్రయించాలన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో మండ ల వ్యవసాయాధికారి కిరణ్మయి, ఏఈవోలు తిరుపతి, కనకరాజు, రైతులు వెంకటేశం, నసీరుద్దీన్‌, మైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పంట నష్టం అంచనా

జన్నారం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలో రెండు రోజులుగా కురిసిన వర్షానికి నష్టపోయిన పంటలను ఏవో సంగీత గురువారం అంచనా వేశారు. మండలంలోని కలమడుగు, కవ్వాలతో పాటు పలు గ్రామాల్లో వరి పంటను పరిశీలించారు. భారీ వర్షం కురవడంతో వరి అత్యధికంగా ఒరిగిపో యింది. పంట నష్టాన్ని అంచనా వేసి పైఅధికారులకు నివేదిక సమర్పించ నున్నట్లు ఏవో తెలిపారు.

Updated Date - Oct 30 , 2025 | 11:07 PM