ఓసీపీ పరిసర ప్రాంతాల పరిశీలన
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:59 PM
శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం ఓపెన్‌కాస్టులో ‘ప్రమాదకరంగా బ్లాస్టింగ్‌లు’ అనే కథనం ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రచురితం అయింది. దీంతో స్పందించిన అధికారులు ఘటనా స్థలా న్ని ఆదివారం పరిశీలించారు.
- ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
జైపూర్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం ఓపెన్‌కాస్టులో ‘ప్రమాదకరంగా బ్లాస్టింగ్‌లు’ అనే కథనం ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రచురితం అయింది. దీంతో స్పందించిన అధికారులు ఘటనా స్థలా న్ని ఆదివారం పరిశీలించారు. అధికారులు నిబంధనలు పాటించకుండా బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తుం డడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నా రు. శనివారం మధ్యాహ్నం జరిగిన బ్లాస్టింగ్‌లో ఓ మట్టి పెల్ల 350 మీటర్లు పైకి ఎగిరి పత్తి చేనులో పడడంతో వైద్య శేఖర్ అనే రైతుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. దీనిపై ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రమాదకరంగా బ్లాస్టింగ్‌లు అనే కథనం ప్రచురితం కావడంతో సింగరేణి అధికారులు స్పందించారు. ఆదివారం ఘటన జరిగిన ప్రదేశాన్ని బ్లాస్టింగ్ ఇన్‌చార్జి కిరణ్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని రైతుకు హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఇందారం ఓసీపీ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్ రెడ్డిని వివరణ కోరగా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదని, ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.