Share News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 17 , 2025 | 11:31 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అధికారులకు సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అధికారులకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్‌ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపీడీ వోలు, ఎంపీవోలు, గృహ నిర్మాణ శాఖాధికారులతో పైలెట్‌ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, అర్హుల జాబితా, రాజీవ్‌ యువ వికాసం పథకంలో అర్హులైన వారి ఎంపిక, తాగునీటి సరఫరా, నమూనా ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణం వంటి అంశాలపై అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పైలెట్‌ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇంటిని 400 చదరపు గజముల నుంచి 600 చదరపు గజాలలో మాత్రమే నిర్మించాలని, అటవీ శాఖాధికారులను సమన్వయం చేసుకోవాలని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి జాబితా రూపొందించి జిల్లా స్థాయి కమిటీకి సమర్పించాలని తెలిపారు. వేసవిలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరాకు చర్య లు తీసుకోవాలని సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని, అందరికి ఉపాధి పని కల్పించాలన్నారు. సమావేశంలో డీపీతివో భిక్షపతి, ఎస్సీ అభివృద్ధి అధికారి సజీవన్‌, సీఈవో లక్ష్మీనారాయణ, మైనార్టీ సంక్షేమాధికారి నదీమ్‌, గిరిజన సంక్షేమాధికారి రమాదేవి, హౌజింగ్‌ పీడీ వేణుగోపాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌: ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల లో విద్యాశాఖ ఆధ్వర్యంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ ముగిం పు కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ పుస్తక పఠన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపా ధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. కార్యక్ర మంలో ఎంఈవో, శిక్షణ సమన్వయకర్త శ్రీని వాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించాలి

రెబ్బెన: తూకం వేసిన ధాన్యాన్ని కేటాయించిన రైస్‌ మిల్లులకు తరలించాలి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. శనివారం ఇందిరానగర్‌లో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్లాల వద్ద తగిన ఏర్పాట్లు రైతులు చేసుకునేలా తగు సూచనలు, సలహాలు అధికారులు అందించాలన్నారు. ప్రస్తుతం అకాల వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్క రైతు టార్పాలిన్‌ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అఽధికారులు త్వరగా ధాన్యం కొనుగోలు చేయడానికి కృషి చేయాలన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ డేవిడ్‌, తహసీల్దార్‌ రాంమోహన్‌, ఏపీవో వెంకటరమణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 11:31 PM