అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి
ABN , Publish Date - Apr 29 , 2025 | 11:42 PM
ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయిం చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆర్డీవో, మున్సిపల్ కార్యాలయం ఎదుటు మంగళవారం ధర్నా చేపట్టారు.
బెల్లంపల్లి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లను అర్హులకే కేటాయిం చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆర్డీవో, మున్సిపల్ కార్యాలయం ఎదుటు మంగళవారం ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, అధికా రులు పారదర్శకంగా సర్వే చేపట్టలేదన్నారు. ఇందిర మ్మ ఇళ్ల జాబితాలో కాంగ్రెస్ నాయకులు, బంధువులు, కార్యకర్తల పేర్లను నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నో ఏళ్లుగా గూడులేక పేదలు ఇబ్బందు లు పడుతుంటే ఇళ్లు ఉన్నవా రికే ఇళ్లను కేటాయించడం సరైందికాదన్నారు. అనర్హుల పేర్లను జాబితాలో నుంచి వెం టనే తొలగించాలని లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షురాలు కళ్యాణి, నాయకులు హేమాజీ, గోవర్ధన్, సంతోష్, శ్రావణ్, స్రవంతి, సుమలత, తదితరులు పాల్గొన్నారు.
నెన్నెల (ఆంధ్రజ్యోతి): అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ కోరారు. మండ ల పార్టీ అధ్యక్షుడు అంగలి శేఖర్ ఆధ్వర్యంలో మంగ ళవారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశా రు. కార్యక్రమంలో బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు శైలెందర్‌సింగ్, నాయకులు కొయిల్కర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.