దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:33 PM
దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తానమి ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. సోమవారం సిర్పూర్(టి) గ్రామ పంచాయతీలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు.
ఎమ్మెల్సీ దండె విఠల్
సిర్పూర్(టి), ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): దశల వారీగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తానమి ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. సోమవారం సిర్పూర్(టి) గ్రామ పంచాయతీలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నిరుపేదకు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల కోసం దళారులను నమ్మవద్దని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన వెంటనే దశల వారీగా నగదు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని ఎవరినీ ఆశ్రయించవద్దని సూచించారు. అనంతరం లబ్ధిదారు లకు మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం కాలనీల్లో పర్యటించారు. రైల్వే స్టేషన్ వెళ్లే రహదారిపై డ్రైనేజీ నిర్మాణానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. బస్టాండు ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్‌కు ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు. ఆయన వెంట కమిటీ సభ్యులు తులసీరాం, రాజా రాం, సలీం, గణపతి, సత్యనారాయణ, సోహెల్ అహ్మద్, రవీందర్, అఫ్సర్ అహ్మద్, ముక్తగిర్‌హుస్సెన్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఏఈ షగియోద్దీన్, ఈవో తిరుపతి పాల్గొన్నారు.