Share News

బరిలో దిగితే బంగారు పతకమే

ABN , Publish Date - May 05 , 2025 | 11:51 PM

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడిని నిజం చేస్తూ చిన్నప్పటి నుంచే విద్యతో పాటు మార్షల్‌ ఆర్ట్స్‌లో రాణిస్తున్నారు అక్కాతమ్ముడు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన వ్యాపారవేత్త పాతనబోయిన సంతోష్‌కుమార్‌ ప్రియాంక దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ అక్కాతమ్ముడు సుదీ క్ష, విహాస్‌ దుర్గాలు మార్షల్‌ ఆర్ట్స్‌లో బరిలో దిగితే బంగారు పతకం సాధిస్తున్నారు. (ఆంధ్రజ్యోతి-నాగార్జునసాగర్‌ )

    బరిలో దిగితే  బంగారు పతకమే

చలకుర్తి గ్రామానికి చెందిన ఈ అక్కాతమ్ము డు ఇద్దరు చిన్నప్పటి నుంచి నుంచే(ఐదేళ ్లవయస్సు) తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తమకు ఇష్టమైన మార్షల్‌ ఆర్ట్స్‌లో రాణిస్తున్నారు. 2021లో నాగార్జునసాగర్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షకు డు శ్రీనివాస్‌ కరాటేలో శిక్షణ ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలానికి తల్లిదండ్రులు నల్లగొండ కు వ్యాపారం నిమిత్తం నల్లగొండ వెళ్లారు. అక్కడ తైక్వాండోలో కోచ్‌ యూనిస్‌ వద్ద శిక్షణ పొం దారు. 2024లో హైదరాబాద్‌లో మాస్టర్‌ మహే ష్‌ వద్ద కరాటే లో కూడా శిక్షణ ప్రారంభించారు. శిక్షణలో ఉండగానే అక్కా తమ్ముడు ఇద్దరు మండల, జిల్లా స్థాయిలో అనేక పతకాలు సాధించా రు. దీంతో మరింతగా మార్షల్‌ ఆర్ట్స్‌పై మక్కువ పెంచుకుని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లారు. ఏ పోటీకి వెళ్లినా బంగారు పతకం సాఽధిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సుదీక్ష 7వ తరగతి చదువుతుండగా, విహాస్‌ దుర్గ 5వ తరగతి చదువుతున్నాడు. చిన్నారుల ప్రతిభను చూసి చిన్నారులను ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, అభినందనలు పొందారు. ఇలా చదువుతో పాటు మార్షల్‌ ఆర్ట్స్‌ల్లో రాణిస్తూ అనేక బంగారు పతకాలు సాఽధిస్తున్న చిన్నారులను తల్లిదండ్రులతో పాటు కోచ్‌లు, ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు.

సుదీక్ష సాఽధించిన పతకాలివే..

2022లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించి న జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం.

2022,23లో తైక్వాండో పోటీఓ్ల ఎల్లో,బ్లూ బెల్ట్‌.

2023,24 సంవత్సరాల్లో తెలంగాణ ప్రభు త్వం హైదరాబాద్‌లో నిర్వహించిన 37వ జాతీయ సబ్‌ జూనియర్‌ పోటీల్లో 29,24 కిలోల విభాగాల్లో బంగారు పతకాలు

2024 లో కరాటేలో ఎల్లో బెల్టు.

2025లో ఏపీలో వైజాక్‌లో నిర్వహించిన 8వ అంతర్జాతీయ కరాటే పోటీల్లో వెండి పతకం, కుమిథే విభాగంలో రజత పతకం.

2025లో కరాటే ఇండియా ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన కుమిథే విభాగంలో బంగారు పతకం.

2025లో తమిళనాడు ప్రభుత్వం ఊటీలో నిర్వహించిన 15వ బ్రేవ్‌ ఫైటర్స్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ కరాటే చాంపియన్‌ కటార్‌, కుమిథే విభాగాల్లో బంగారు పతకాలు.

విహాస్‌ దుర్గ్గా సాఽధించిన పతకాలివే..

తన 5వ ఏటనే మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ ను ప్రారంభించిన విహాస్‌ దుర్గ పలు పో టీల్లో బంగారు పతకాలు సాధించాడు.

2021లో సుమన్‌ షోలో నిర్వహించిన 23వ జాతీయ కరాటే పోటీల్లో కటా విభాగంలో బంగారు పతకం.

2022లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం.

2022,23లో తైక్వాండోలో ఎల్లో, బ్లూ బెల్టు

2023సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించిన తైక్వాండో పోటీల్లో 25 కిలోల విభాగంలో బంగారు పతకం.

2024 లో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించిన 8వ అంతర్జాతీయ కరాటే చాంఫియన్‌ పోటీల్లో బంగారు పతకం.

2025 లో హైదరాబాద్‌లో నిర్వహించిన కరాటే ఓపెన్‌ చాంఫియన్‌ షిప్‌ పోటీల్లో బంగారు పతకం.

2025లో కరాటే ఆర్గనైజేషన్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన కుమిథే పోటీల్లో బంగారు పతకం.

2025 లో తమిళనాడు ప్రభుత్వం ఊటీలో నిర్వహించిన 15వ బ్రేవ్‌ ఫైటర్స్‌ ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ కరాటే పోటీల్లో కటా, కుమితే విభాగాల్లో బంగారు పతకాలను సాధించాడు

Updated Date - May 05 , 2025 | 11:52 PM