దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించండి
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:45 PM
వైద్య సిబ్బంది మండలంలో పర్యటించి దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను గుర్తించాలని చికిత్సలు అందించాలని జిల్లా వైద్యాధికారి అనిత సూచించారు.
- జిల్లా వైద్యాధికారి అనిత
కాసిపేట డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): వైద్య సిబ్బంది మండలంలో పర్యటించి దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను గుర్తించాలని చికిత్సలు అందించాలని జిల్లా వైద్యాధికారి అనిత సూచించారు. బుధవారం కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ 30 ఏళ్లు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రతపై అవగాహన పెంచాలన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం బారిన పడే అవకాశాలుం టాయన్నారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి వైద్య శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, సాధారణ ప్రసవాలకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. గత నెలలో మండలంలోని సాముగూడకు చెందిన అనురాధ ప్రసవించిన వెంటనే తల్లి, కొడుకు ఇద్దరు మృతిచెందగా బుధవారం కుటుంబాన్ని పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. ఆమె వెంట కాసిపేట మెడికల్ ఆఫీసర్ దివ్య, సూపర్ వైజర్ ఆర్‌ఎస్ పద్మ, డీపీహెచ్‌ఎన్ వసుమతి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
భీమిని: శిశు మరణాలను తగ్గించేందుకు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమసన్వయంతో పనిచేయాని మంచిర్యాల డీఎంహెచ్‌ఓ అనిత సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రన్ని తనిఖీ చేశారు. మండలంలో వడాల, కన్నెపల్లి మండలంలో మెట్టుపల్లి గ్రామంలో శిశువులు మృతి చెందడంతో ఆమె సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిస్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యులు అనిల్‌కుమార్, సీహెచ్‌వో జలపతి, డీపీహెచ్‌ఎన్ పద్మ, హెచ్‌ఎస్ వసువతి, ఇందిర, హెల్త్‌అసిస్టెంట్ ఉమాశంకర్, సిబ్బంది పాల్గొన్నారు.