విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:51 PM
కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేకదృష్టి సారి స్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. దండేపల్లి మండల కేం ద్రం సమీపంలోగల కర్ణపేటలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈవో యాదయ్యతో కలిసి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
- ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు
- కేజీబీవీ విద్యాలయం సందర్శన
దండేపల్లి జూన్ 23 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేకదృష్టి సారి స్తోందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. దండేపల్లి మండల కేం ద్రం సమీపంలోగల కర్ణపేటలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని డీఈవో యాదయ్యతో కలిసి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థుల సమస్యలను నేరుగా అడి గి తెలుసుకున్నారు. విద్యాలయ సిబ్బంది పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థినులను ఇబ్బంది పెడితే ఎంతటివారైన సహించేది లేదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించి, వారికి మంచి విద్యాభోధన అందించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థినులు క్రమశిక్షణతోపాటు పోటీతత్వంతో చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. సర్కార్ బడిలో నాణ్యమైన విద్య అందుతుందని, ప్రభు త్వం కూడా కార్పోరేట్ స్థాయి తరహాలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పేద విద్యార్థులకోసం కోట్లాది రూపాయాలు వెచ్చించి పాఠశాలల అభి వృద్ధికి పాటుపడుతోందని వివరించారు. వెనుకబడిన విద్యార్థినులపై ఉపాధ్యాయులు ప్రత్యే శ్రద్ధ వహించాలన్నారు.
సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం
భోజనంలో మెనూ పాటించకుండా విద్యార్థు లను అర్ధాకలితో ఉంచుతూ వారిపట్ల దురు సుగా ప్రవర్తిస్తున్న విద్యాలయ ప్రత్యేకాధికారి, ముగురు సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాలయంలో ఎస్‌వోతో పాటు టీ చింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందిని విచారించి వివ రాలు సేకరించారు. ఉదయం వేళలో తమతో దురుసుగా ప్రవర్తిస్తూ నానాబూతులు తిడుతూ మెనుప్రకారం భోజనం పెట్టడం లేదని ఎమ్మెల్యే ఎదుట విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. తమతోనే టాయిలెట్స్ గ్రౌండ్‌వాటర్ ట్యాంక్ లను తదితర పనులు చేయిస్తున్నారని వివరించారు. దీంతో ఎమ్మెల్యే, డీడిఈవో ఎస్‌వో, సిబ్బం దిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ అనం తరం ఎస్‌వో, బాధులైన ముగ్గురు సిబ్బందిని వెంటనే సర్వీస్ నుంచి తొలగించాలని ఎమ్మెల్యే డిఈవోకు సిఫారసు చేయడంతో నివేదికను జిల్లాకలెక్టర్‌కు పంపించారు. బాధ్యులైన సిబ్బం దిని స్కూల్‌నుంచి వెళ్లిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా సెక్టోరియల్ అధికారి సత్య నారాయణమర్తి, ఎంఈవో చిన్నయ్యను స్కూల్ ను పర్యవేక్షించమని డీఈవో ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీడీవో ప్రసాద్, ఎంపీవో విజయప్రసాద్, ఎంఈవోదుర్గం చిన్నయ్య, ఏఎం సీ చైర్మన్ దాసరిప్రేమ్‌చందు, ఆర్‌జీపీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, మాజీ ఎంపీ పీ గడ్డం శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.