పోడు రైతులపై వేధింపులు ఆపాలి
ABN , Publish Date - Jun 09 , 2025 | 11:45 PM
సిర్పూరు నియోజకవర్గంలో పోడు రైతులను అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారని, వెంటనే ఆపాలని కోరుతూ సోమవారం హైదరాబాద్‌లోని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(పీసీసీఎఫ్) డాక్టర్ సువర్ణకు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు వినతి పత్రం అందజేశారు.
సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు
కాగజ్‌నగర్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): సిర్పూరు నియోజకవర్గంలో పోడు రైతులను అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారని, వెంటనే ఆపాలని కోరుతూ సోమవారం హైదరాబాద్‌లోని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(పీసీసీఎఫ్) డాక్టర్ సువర్ణకు సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిర్పూరు నియోజకవర్గంలో ప్లాంటేషన్ పేరిట అటవీ శాఖ అధికారులు పోడు రైతులను వేధిస్తున్నట్టు తెలిపారు. పోడు భూముల్లో మొక్కలు నాటుతామని పోడు పనులను అడ్డుకుంటున్నట్టు వివరించారు. అనంతరం పీసీసీఎఫ్ మాట్లాడుతూ సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఎల్ములే మల్లయ్య, అంకులు తదితరులు ఉన్నారు.