Share News

అన్నదాతల్లో ఆనందం

ABN , Publish Date - Jun 18 , 2025 | 11:40 PM

రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు తన హామీని నిలబెట్టుకుంది. వానాకాలం సాగు సమయానికి అనుకున్న ప్రకారం రైతు భరోసా నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.

అన్నదాతల్లో ఆనందం

- రైతు భరోసాపై మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్‌

- రైతుల ఖాతాల్లో నగదు జమచేసిన సర్కారు

- జిల్లాలో లక్షా 72 వేల మంది రైతులకు లబ్ధి

- మూడెకరాలున్న వారికి పెట్టుబడి సాయం

మంచిర్యాల, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): రైతులకు పంట పెట్టుబడి సాయం అందజేస్తామన్న తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు తన హామీని నిలబెట్టుకుంది. వానాకాలం సాగు సమయానికి అనుకున్న ప్రకారం రైతు భరోసా నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మూడెకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా కల్పిస్తుండగా, ఆ మేరకు అవసరమైన నిధులను విడదల చేసింది. మిగిలిన రైతులందరికీ రాబోయే తొమ్మిది రోజుల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు. ఈ సంవత్సరం వర్షాకాలం ముందస్తుగా ప్రారంభం కావడంతో రైతులు ఇప్పటికే వానాకాలం సాగు పనులు ప్రారంభించారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు కొనుగోలు చేయడంతోపాటు వరినాట్లు కూడా వేస్తున్నారు. సకాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందజేస్తుండటంతో ట్రాక్టర్ల కిరాయిలు, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు, కూలీల ఖర్చుకు ఉపయోగపడతాయనే భావనలో రైతులు ఉన్నారు. జూన్‌లోనే వానాకాలం పంట పెట్టుబడి సాయం అందడం ఇదే మొదటిసారి కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఫ 1.71 లక్షల రైతులకు లబ్ధి....

ప్రభుత్వ నిర్ణయం మేరకు రైతు భరోసా పథకానికి జిల్లాలో 1,71,307 మంది రైతులు అర్హత కలిగి ఉన్నట్లు బ్యాంకర్ల సమాచారం మేరకు ప్రభుత్వం గుర్తించింది. వారికి నగదు జమ చేసేందుకు 205 కోట్ల 11 లక్షల ఆరు వేల 234 రూపాయలు అవసరం అవుతాయని గుర్తించారు. వానాకాలం కోసం జిల్లాలో వివిధ రకాల పంటలు 3.18 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అధికారులు ప్రణాళిక రూపొందించారు. కాగా జిల్లా వ్యాప్తంగా వానాకాలం సాగుకు సంబంధించి రైతు భరోసా కింద బుధవారం వరకు లక్షా 13వేల 886 మంది రైతులకు లబ్ది చేకూరగా, రూ. 86 కోట్ల 42 లక్షల 50వేల 138 రూపాయలు బ్యాంకు అకౌంట్లలో నగదు జమ అయింది.

మండలాల వారీగా రైతులకు చెల్లించిన నగదు..

రైతు భరోసా పథకం కింద వానాకాలం సాగు కోసం జిల్లాలో మొత్తం అర్హులైన రైతులను 1, 71,307 మందిని ఎంపిక చేయగా, రూ. 205 కోట్ల 11 లోల 6వేల 234 నగదు అవసరం ఉంటుందని భావిస్తున్నారు.

- బెల్లంపల్లి మండలంలో 6,165 మందిని ఎంపిక చేయగా రూ. 7 కోట్ల 53 లక్షల ఏడు వేల 978 నగదు అవసరం కాగా ఇప్పటి వరకు 3,786 మందికి రూ. 2 కోట్ల 93 లక్షల 48వేల 568 నగదు బ్యాంకుల్లో జమ చేశారు.

- కాసిపేట మండలంలో 5,668 మంది రైతులను ఎంపిక చేయగా ఇప్పటి వరకు 3,701 మందికి.. మూడుకోట్ల 10 లక్షల 35వేల 375 రూపాయలు జమ చేశారు.

- తాండూరు మండలంలో 8,407 మందికి గాను 5,120 మందికి నాలుగు కోట్ల 29 లక్షల 63వేల 607 రూపాయలు జమ చేశారు.

- భీమిని మండలంలో 8,013 మందికి గాను 4,337 మందికి నాలుగు కోట్ల ఒక లక్షా రెండు వేల 43 రూపాయలు చెల్లించారు.

- కన్నెపల్లి మండలంలో 8,928 మందికి గాను 5,363 మందికి నాలుగు కోట్ల 60 లక్షల 26వేల 772 రూపాయలు జమచేశారు.

- నెన్నెల మండలంలో 9,109 మందికి గాను 6,263 మందికి ఐదు కోట్ల 66వేల 701 రూపాయలు చెల్లించారు.

- వేమనపల్లి మండలంలో 7,297 మందికిగాను 5,505 మందికి నాలుగు కోట్ల 31 లక్షల 84వేల 963 రూపాయలు జమ చేసింది.

- భీమారం మండలంలో 5583 మందికిగాను 3578 మందికి రెండు కోట్ల 81 లక్షల 89వేల 849 రూపాయలు చెల్లించారు.

- చెన్నూరు మండలంలో 16,203 మందికి గాను 10,737 మందికి చెల్లించిన నగదు ఎనిమిది కోట్ల 66 లక్షల 26వేల 156 రూపాయలు.

- జైపూర్‌ మండలంలో 16,336 మందికి గాను 8888 మందికి ఐదు 5 కోట్ల 88 లక్షల 10వేల 615 రూపాయలు జమ చేశారు.

- కోటపల్లి మండలంలో 13,396 మందికి గానూ 9244 మందికి అందిచిన నగదు ఏడు కోట్ల 78 లక్షల 22 వేల 593 రూపాయలు.

- మందమర్రి మండలంలో 6,822 మందికిగాను 4,194 మందికి మూడు కోట్ల 17 లక్షల 94వేల 201 రూపాయలు చెల్లించారు.

- దండేపల్లి మండలంలో 17,375 మందికిగాను 12,958 మందికి తొమ్మిది కోట్ల 21 లక్షల 61వేల 282 రూపాయలు జమ చేసింది.

- హాజీపూర్‌ మండలంలో 9,839 మందికిగాను 6,638 మందికి జమ చేసిన నగదు నాలుగు కోట్ల 64 లక్షల, 47వేల 794 రూపాయలు.

- జన్నారం మండలంలో 15,495 మందికిగాను 12,129 మందికి ఎనిమిది కోట్ల 40 లక్షల 8వేల 782 రూపాయలు చెల్లించారు.

- లక్షెట్టిపేట మండలంలో 14,239 మందికి గాను 10,399 మందికి అందిన నగదు ఏడు కోట్ల 21 లక్షల 61వేల 968 రూపాయలు.

- మంచిర్యాల మండలంలో 1369 మందికిగాను 546 మందికి రూ. 35 లక్షల 13వేల 958

- నస్పూర్‌ మండలంలో 1063 మందికిగాను 500 మందికి రూ. 35 లక్షల 84వేల, 911 నగదును ఇప్పటి వరకు ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసింది.

కాంగ్రెస్‌ నాయకుల సంబరాలు

లక్షెట్టిపేట (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రైతుల పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధులను విడుదల చేయడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బుధవారం సంబరాలు జరుపుకున్నారు. స్థానిక ఐబీలో నాయకులు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అద్యక్షుడు ఎండీ ఆరీఫ్‌, మండల అధ్యక్షుడు పింగిళి రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు పూర్ణచందర్‌రావు, చింత అశోక్‌, యూత్‌ అధ్యక్షుడు రాందేని చిన్నవెంకటేష్‌, బొప్పు సుమన్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:40 PM