Share News

మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:29 AM

చెన్నూరు/జైపూర్‌ ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : గణేష్‌ మండపాల నిర్వహకులు నియమ నిబంధనలు పాటించాలని జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు. చెన్నూర్‌ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన గణేష్‌ ఉత్సవ కమిటీ సమావేశంలో, జైపూర్‌ ఏసీపీ కా ర్యాలయంలో పీస్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు

చెన్నూరు/జైపూర్‌ ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి) : గణేష్‌ మండపాల నిర్వహకులు నియమ నిబంధనలు పాటించాలని జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు. చెన్నూర్‌ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్‌హాలులో ఏర్పాటు చేసిన గణేష్‌ ఉత్సవ కమిటీ సమావేశంలో, జైపూర్‌ ఏసీపీ కా ర్యాలయంలో పీస్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్‌ మండపాలను ఏర్పాటు చేసే నిర్వహకులు ముందుగా పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇచ్చి అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని సూ చించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. సమావేశంలో సీఐ దేవేందర్‌ రావు, ఎస్‌ఐ సుబ్బారావు, విద్యుత్‌, మున్సిపల్‌ అధికారు లు, ఉత్సవకమిటీ, మైనార్టీ సభ్యులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి: గత ఏడాది గణేష్‌ ఉత్సవాల్లో గొడవలకు కారణమైన వ్యక్తులను టూటౌన్‌ ఎస్‌ఐ కిరణ్‌ కుమార్‌ తహసీల్దార్‌ ఎదుట బుధవారం బైండోవర్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ గణేష్‌ ఉత్సవాలను, ప్రశాంత వాతవరణంలో నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు.

Updated Date - Aug 21 , 2025 | 12:29 AM