Share News

పీడిత ప్రజల పోరాట గొంతుక గద్దర్‌

ABN , Publish Date - Aug 06 , 2025 | 11:42 PM

ప్రజా యుద్దనౌక గద్దర్‌ పీడిత ప్రజల పోరాటగొంతుకగా నిలిచారని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గద్దర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించి మాట్లాడారు.

పీడిత ప్రజల పోరాట గొంతుక గద్దర్‌
మంచిర్యాలలో గద్దర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న తెలంగాణ సాంస్కృతిక కళాకారులు

బెల్లంపల్లి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రజా యుద్దనౌక గద్దర్‌ పీడిత ప్రజల పోరాటగొంతుకగా నిలిచారని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. బుధవారం పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గద్దర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించి మాట్లాడారు. తెలుగు ప్రజా సాంస్కృతిక ఉద్యమంలో గద్దర్‌ది అద్వితీయ పాత్ర అని పేర్కొన్నారు. ప్రజాసమస్యలను పాటగా మలిచి పాలకుల వెన్నులో వణుకు పుట్టించిన ప్రజా గాయకుడు గద్దర్‌ అని పేర్కొన్నారు. సామ్రాజ్యవాద దోపిడీ, మతోన్మాదం, అంటరానితనం, ప్రజా వ్యతిరేక విధానాలపై వేలాది పాటలు రాసి ప్రజలను చైతన్యం చేశారని కొనియాడారు. ఆయన ఎంచుకున్న సిద్ధాంతం కోసం జీవితాన్ని త్యాగం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నాయకులు నీరటి రాజన్న, ఐఎఫ్‌టీయు నాయకులు ఎండీ చాంద్‌పాషా, టీఎన్‌టీయుసీ నాయకులు మణిరాంసింగ్‌, నాయకులు గోగర్ల శంక ర్‌,లు పాల్గొన్నారు.

మంచిర్యాల కలెక్టరేట్‌ (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బుధవారం ప్రజాయుద్ద నౌక గద్దర్‌ వర్ధంతిని తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా కళాకారులు నిర్వహించారు. గద్దర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాకారులు కొప్పర్తి సురేందర్‌, కొప్పర్తి రవీందర్‌, ములకల మురళి, రమేష్‌, కుమ్మరి శ్రావణ్‌కుమార్‌, గొడిసెల కృష్ణ, పోశన్న, శ్రీనివాస్‌, నాగలక్ష్మీ, శిరీష, సంధ్య, నిరోషా, సల్లూరి కృష్ణ, సత్యం పాల్గొన్నారు.

మంచిర్యాల క్రైం (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల పట్టణం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో గద్దర్‌ వర్ధంతిని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక, మాదిగ స్టూడెంట్‌ ఫోరం నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్‌, వడ్లకొండ సంజయ్‌, ప్రవీణ్‌, అనురాగ్‌, విజయ్‌, సుమన్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 11:42 PM