Share News

బీసీల వాటా సాధించేవరకు పోరాటం

ABN , Publish Date - May 05 , 2025 | 11:55 PM

జనాభా ప్రాతిపాదికన బీసీలకు విద్యా, ఉద్యోగ, వ్యాపార రాజకీయ రంగాల్లో రావాల్సిన వాటా సాధించేవరకు పోరాటం కొనసాగి స్తామని బీసీ ఆజాది ఫెడరేషన్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్‌ తెలిపారు.

బీసీల వాటా సాధించేవరకు పోరాటం
బీసీ మేల్కొలుపు యాత్రను ప్రారంభిస్తున్న జక్కని సంజయ్‌కుమార్‌, నాయకులు

- బీసీ ఆజాది ఫెడరేషన్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్‌

వాంకిడి, మే 5 (ఆంధ్రజ్యోతి): జనాభా ప్రాతిపాదికన బీసీలకు విద్యా, ఉద్యోగ, వ్యాపార రాజకీయ రంగాల్లో రావాల్సిన వాటా సాధించేవరకు పోరాటం కొనసాగి స్తామని బీసీ ఆజాది ఫెడరేషన్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్‌కుమార్‌ తెలిపారు. మేమెంతో మాకంతా వాటా నినా దంతో బీసీ మేల్కొలుపు యాత్రను సోమవా రం ఆయన వాంకిడి మండల కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జక్కని సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ దేశ జనాభాలో సగానికిపైగా ఉన్న బీసీలు సరైౖన అవకాశాలు లేక అన్నిరంగాల్లో వెనుకబడి అణగారిన వర్గాలుగా పేదవారుగా ఉన్నార న్నారు. ఈ దేశానికి మూలనివాసులైన మెజారిటీ ప్రజలు బీసీలని స్వతంత్ర భారత దేశంలో మెజారిటీ ప్రజల లక్ష్యాలను పక్కన బెట్టి కార్పొరేటీకరణకు బెట్టుబడిదారులకు ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్నాయని అయన పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగ, వ్యాపా ర, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించి జనాభా ప్రాతిపదికన వాటాను అందించాలని డిమాండ్‌ చేశారు. బీసీ కులగణన సాధనకో సం 78 సంవత్సరాలుగా బీసీలు పోరాడుతు న్నా ప్రభుత్వాలు వంచించడం తప్ప చిత్తశుద్ధితో పనిచేయడంలేదన్నారు. బీసీల అభివృద్ధి కోసం మండల కమిషన్‌ చేసిన సిఫారుసులను తుంగలో తొక్కారని ఈ దేశా నికి స్వాతంత్రం వచ్చాక బీసీలకు స్వాతం త్రం పోయిందన్నారు.

విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ సామాజిక రంగాల్లో మేమెంతో మాకంత వాటాను సాధించినప్పుడే నిజమైన విముక్తి లభిస్తుందన్నారు. బీసీల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు. బీసీ ఉద్యమాన్ని పల్లెల్లో బలోపేతంచేసి బీసీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా బీసీ ఆజాది ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బీసీ మేల్కొల్పు రథయాత్రను తెలంగాణ జాతిపి త, తెలంగాణ సామాజిక ఉద్యమాల పితా మహుడు ఆచార్య కొండ లక్ష్మణ్‌బాపూజీ స్ఫూర్తితో ఆయన స్వగ్రామమైన వాంకిడి నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ఈ యాత్ర ఆలంపూర్‌లో ముగుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రజక రిజర్వేషన్‌ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్‌, బీసీ ఆజాది ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యని ర్వాహక అధ్యక్షుడు కుడికాల భాస్కర్‌, ప్రధాన కార్యద ర్శి వ్యాసభట్టు మధుసూదన్‌ రాజు, వివిధ సంఘాల నాయకులు జినుకల లక్ష్మ ణరావు, జగవెల్లి మనోహర్‌, చిలుకమారి శ్రీనివాస్‌, చిదురాల సతీష్‌, గుర్నులే నారాయణ, మహోల్‌కార్‌ అశోక్‌, జాబిరే పెంటు, జైరాం, బండే తుకారాం, సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2025 | 11:56 PM