జీవకోటికి బతుకు భయం
ABN , Publish Date - May 19 , 2025 | 11:27 PM
భూమి మీద ప్రతీ జీవికి ఒక ప్రత్యేక ఉంది. ఈగ, దోమ, గద్ద, ఎద్దు, నత్త, పీత సూక్ష్మజీవులు ఎంతో కొంతప్రాధాన్యం కలిగి ఉన్నాయి. ఇవన్నీ పరోక్షంగా ఒకదా నికొకటి ఆధారపడి జీవిస్తూ ప్రకృతిలో ఆహ్లాదాన్ని నింపుతూ వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తున్నాయి.

- అభివృద్ధి పేరిట విధ్వంసం
- తరిగిపోతున్న పచ్చదనం
- 22న ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం
నస్పూర్, మే 19 (ఆంధ్రజ్యోతి): భూమి మీద ప్రతీ జీవికి ఒక ప్రత్యేక ఉంది. ఈగ, దోమ, గద్ద, ఎద్దు, నత్త, పీత సూక్ష్మజీవులు ఎంతో కొంతప్రాధాన్యం కలిగి ఉన్నాయి. ఇవన్నీ పరోక్షంగా ఒకదా నికొకటి ఆధారపడి జీవిస్తూ ప్రకృతిలో ఆహ్లాదాన్ని నింపుతూ వాటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తున్నాయి. మానవుడి విలాసవంత మైన జీవితం ప్రకృతిని శాసిస్తు న్నందున మానవ మనుగడ తో జీవ వైవిద్యం ప్రశ్నార్థకంగా తయారైంది. జీవ వైవిధ్యానికి ఆయువు పట్టుగా నిలిచిన అడవులు, నీటి ఆవాసాలు ద్వంసమై పోతున్నాయి. వీటిపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది జీవరాశుల మనుగడ ప్రశ్నర్థాకంగా తయారైంది. పులులు, రుతలు, ఎలుగు బంట్లు, జింకలు, మనుబోతులు, నీలుగాయి, రాబందులు, సీతాకొకచిలు కలు, బట్టమేక పిట్టలు, ఊర పిచ్చుకలు, పాలపిట్టలు, అడవి పావురాలు, రకరకాల అడవి కోళ్లు, తదితర పక్షులు కనిపించకుండా పోయా యి. ఈ నెల 22 బుధవారం ప్రపంచ జీవవైవిధ్య సంర క్షణ దినం సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..
జీవ వైవిద్యాన్ని కాపాడేందుకు ఐక్య రాజ్య సమితి 1992లో బ్రెజిల్ రాజధాని రియో డి జెనేరియోలో తొలిసారిగా జీవ వైవిఽధ్య దినోత్సవాన్ని నిర్వహించింది. 2012లో హైదరాబాద్‌లో 11వ జీవ వైవిధ్య సదస్సు నిర్వహించగా ఇందులో 193 దేశాలకు చెందిన ప్రతిని ధులు పాల్గొని జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రతిన బూనాయి. భారత ప్రభుత్వం 2002లో జీవ వైవిధ్య చట్టాన్ని తీసుకువచ్చింది. వన్యప్రాణులను వేటాడే వేటగాళ్లకు బయోడైవర్సిటీ యాక్ట్-2002 ప్రకారం నాన్ బెయిలబుల్ శిక్షలను విధించే అవకాశం ఉంటుంది. మంచిర్యాల జిల్లాలో లక్షకు పైగా హెక్టార్ల అటవీ విస్తీర్ణం కలిగి ఉండగా ఎన్నో జీవజాతులకు అనుకూలంగా ఉన్నది.
- పచ్చదనం పెరగాలి..
అటవీ సంపద తరిగిపోవడం వలన పక్షులకు, జంతువుల సహజ సిద్ధమైన ఆవాసాలు కోల్పోయి వాటి జీవన విధానానికి ముప్పు వాటిల్లడంతో అంతరించి పోతున్నాయి. భూగోళంపై జీవిస్తున్న అన్ని జీవకోటి ప్రాణులతో మానవుడికి ప్రత్యక్షంగానో, పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి. మానవుడి దెబ్బకు పుడమి పేగు తెంచుకుని అడవులపై ఆధారపడి జీవిస్తున్న చాలా ప్రాణులు కనుమరుగవుతున్నాయి. అభివృద్ధి పేరిట సాగుతున్న విధ్వంసం కారణంగా నేడు భూతా పం విపరీతంగా పెరుగుతోంది. మానవాళి చర్యల కారణంగా ఓజోన్ పొర చిధ్రమవుతూ భూగోళాన్ని మరింతా వేడి పుట్టిస్తోంది. అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతున్న మనం జీవ వైవిధ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఎన్నో పర్యావరణ సమస్యలను, భయంకర విపత్తులను కారణమవుతున్నాం. జీవ వైవిధ్య సమతుల్యంగా ఉంటేనే మానవుడి జీవనం ముందుకు సాగుతుంది. పచ్చదనం పెంపునకు, జంతుజాలాన్ని కాపాడేందుకు కృషి చేసిప్పుడే జీవివైవిధ్యం వర్థిల్లుతుంది.