రైతులు సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Oct 25 , 2025 | 11:45 PM
రైతులు శాస్త్రసాంకేతిక రంగాలపై అవగాహ న పెంచుకుని వ్యవసాయం చేయాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి సురేఖ
కాసిపేట, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రైతులు శాస్త్రసాంకేతిక రంగాలపై అవగాహ న పెంచుకుని వ్యవసాయం చేయాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నారు. మండలంలోని సండ్రల్‌పాడ్‌లో బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అధిక సాంద్రత పత్తి సాగు పద్ధతులపై క్షేత్ర దినో త్సవం కార్యక్రమానికి శనివారం హాజరై మాట్లాడారు. జిల్లా రైతులు వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అధిక సాంద్రత పత్తి సాగు సాంకేతికతను అవలంభించాలని సూచించారు. దీని ద్వారా తేలికపాటి నేలల్లో పత్తి దిగుబడులు పెరిగి రైతులు ఆర్ధికంగా లాభాలు పొందుతార న్నారు. కిసాన్ కపాస్ యాప్ గురించి అవగాహన కల్పించారు. ఈ యాప్ ద్వారా పత్తిని సులభతరంగా సీసీఐలో అమ్ముకోవచ్చన్నారు. రైతులందరు యాప్‌లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలన్నారు. పత్తి అమ్మిన తర్వాత డబ్బులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయని తెలిపారు. దీంతో దళారి వ్యవస్థ నిర్మూలించడం సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మహేష్ మాట్లాడుతూ అధిక సాంద్రత పత్తి సాగు సాంకేతికత ద్వారా అధికదిగుబడులు పెరగడమే కాకుండా నేలసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ నాగరాజు, ఆత్మచైర్మన్ రౌతు సత్తయ్య, బెల్లంపల్లి ఏడీఏ రాజనరేందర్, కాసిపేట ఏఈవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.