రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:21 PM
వచ్చే యాసంగి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): వచ్చే యాసంగి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటల సాగు పై వ్యవసాయాధికారులు రైతులకు అవసరమైన మెలకువలు, సలహా లు అందించాలన్నారు. జిల్లాలో వచ్చే యాసంగి సీజన్‌లో 1.43 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో అధికా రులు తమ పరిధిలో అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. మండలాల వారీగా ఎరువులు, యూరియా నిల్వలను సమీక్షించి రైతు లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న సహజ కారణాల వల్ల నష్టపోయిన పంటలపై వ్యవ సాయ విస్తరణ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పంట నష్టం నివేదికలను స్పష్టంగా రూపొందించి సమర్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు పాటిస్తూ కొనుగోలు చేయాలని సూ చించారు. ఈ సందర్భంగా పంటల సాగులో డ్రోన్స్ వినియోగంపై క్రాప్ క్రాఫ్స్ట్ ఇన్నోవేషన్ కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజం టేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, అధికారులు పాల్గొన్నారు.
- అవగాహనతోనే న్యుమోనియా నివారణ
అవగాహనతోనే న్యుమోనియాను నివారించవచ్చని కలెక్టర్ కుమార్‌దీపక్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో న్యుమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్లను, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్, ఉపకేంద్రాల వైద్యులు, సిబ్బంది ద్వారా న్యుమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించా లన్నారు. న్యుమోనియా ఉపిరితిత్తులకు వచ్చే ఇన్‌ఫెక్షన్ అని, చలికాలంలో పిల్లలు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుంటే వెంటనే సమీప వైద్యులను సంప్రదించి చికిత్స అందించాలన్నారు. కార్యక్రమం లో డీఎంహెచ్‌వో అనిత, ఉప వైద్యాధికారి సుధాకర్ నాయక్, ఆర్‌ఎస్ పద్మ,మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.