Share News

యూరియా కోసం రైతుల పడిగాపులు

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:38 PM

మండలం లోని పడ్తన్‌పల్లిలో పీఏసీఎస్‌లో బుధవారం పోలీసు పహా రా మధ్య రైతులకు యూరియా బస్తాల పంపిణీ జరిగిం ది. ఉదయం ఐదు గంటలకే పడ్తన్‌పల్లి పీఏసీఎస్‌కు వచ్చే రైతులు యూరియా కోసం నిరీక్షించారు.

యూరియా కోసం రైతుల పడిగాపులు
పడ్తన్‌పల్లి పీఏసీఎస్‌లో యూరియా కోసం క్యూలైన్‌లో ఉన్న రైతులు

హాజీపూర్‌, సెప్టెంబరు 10 (ఆంఽధ్రజ్యోతి): మండలం లోని పడ్తన్‌పల్లిలో పీఏసీఎస్‌లో బుధవారం పోలీసు పహా రా మధ్య రైతులకు యూరియా బస్తాల పంపిణీ జరిగిం ది. ఉదయం ఐదు గంటలకే పడ్తన్‌పల్లి పీఏసీఎస్‌కు వచ్చే రైతులు యూరియా కోసం నిరీక్షించారు. యూరియా రాగా నే రైతుల తోపులాటలు జరుగకుండా ఎస్‌ఐ స్వరూప్‌రాజ్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతులను వరు స క్రమంలో ఉంచి యూరియా అందించారు. బుధవారం 222 మంది రైతులకు 444 బస్తాలు పంపిణీ చేశారు. బస్తాలు దొరకని 110మంది రైతులకు మరుసటి రోజు కోసం టోకెన్లు అందజేశారు.

దండేపల్లి: యూరియా కోసం రైతులు ఎవరు ఆందోళ న చెందవద్దని, రైతులకు అవ సరమైన యూరియాను ఎ లాంటి ఇబ్బందులు లేకుండా అందిస్తామని దండేపల్లి మం డల వ్యవసాఽయాధికారి గొర్ల అంజిత్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం దండేపల్లిలో నెల్కి వెంకటాపూర్‌ సోసైటి ఆధ్వ ర్యంలో యూరియా కోసం వచ్చి రైతుల కోసం తాగునీరు, టెంటు, కూర్చీలను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల బందోబస్తు నడుమ యూరియా పంపిణి చేశారు. కార్యక్రమంలో సోసైటి కార్యదర్శి పేరం వెంకటేష్‌, ఏఈవో మౌనిక, సోసైటి సిబ్బంది ఉన్నారు.

చెన్నూరు: మండలంలోని కిష్టంపేట గ్రామంలో పీఏసీ ఎస్‌ ఆధ్వర్యంలో 222 యూరియా బస్తాలు వచ్చాయి. దీంతో బుధవారం రైతులు రైతు వేదిక వద్ద క్యూ కట్టారు. వ్యవసాయాధికారులు ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తాను పంపిణీ చేశారు. కాగా రైతులకు సరిపడినంత యూరియా సక్రమంగా అందించాలని రైతులు కోరారు.

Updated Date - Sep 10 , 2025 | 11:38 PM