Share News

నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:58 PM

ప్రజలందరు నిర్భయం గా ఓటు హక్కును వినియోగించుకోవాలని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం చిర్రకుంట, పొన్నారం, వెంకటాపూర్‌, పులి మడుగు గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహిం చారు.

నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
వెంకటాపూర్‌లో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహిస్తున్న సీఐ శశిధర్‌రెడ్డి, పోలీసులు

మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి

మందమర్రిరూరల్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజలందరు నిర్భయం గా ఓటు హక్కును వినియోగించుకోవాలని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం చిర్రకుంట, పొన్నారం, వెంకటాపూర్‌, పులి మడుగు గ్రామాల్లో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ప్రజలతో సీఐ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓట్లు వేయాలన్నారు. ప్రజలు, రాజకీయ నాయకులు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు సహకరించాల న్నారు. కార్యక్రమంలో మందమర్రి, రామకృష్ణపూర్‌ ఎస్‌ఐలు రాజశేఖర్‌, రాజశేఖర్‌, పోలీసులు పాల్గొన్నారు.

కోటపల్లి: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి, గొడవలు అల్లర్లకు తావు లేకుండా ప్రతీ ఒక్కరు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోవాలని చె న్నూరు రూరల్‌ సీఐ బన్సీలాల్‌ అన్నారు. మంగళవారం రాత్రి మండలంలోని సిర్సా గ్రామంలో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కోటపల్లి, చెన్నూరు ఎస్‌ఐలు రాజేందర్‌, సుబ్బారావు, జగదీశ్వర్‌రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Dec 09 , 2025 | 11:59 PM