Share News

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

ABN , Publish Date - Jul 25 , 2025 | 11:46 PM

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా, దోమలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్‌ సూచించారు.

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
నస్పూర్‌లో మురుగు గుంతలో స్ర్పే చేస్తున్న వైద్య సిబ్బంది, పక్కన జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్‌

జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్‌

నస్పూర్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా, దోమలు వృద్ధి చెందకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్‌ సూచించారు. విలేజ్‌ నస్పూర్‌లో శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి హరీష్‌రాజ్‌ పలు ఇళ్లను సందర్శించారు. ఇంటి పరిసరాల్లో నీటి గుంతలు ఉండగా అందులో దోమలు నివారణ మందు స్ర్పే చేయించారు. నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. దోమకాటు కారణంగా మలేరియా, డెంగ్యూ, చికెన్‌గునియా వ్యాప్తి చెందుతాయని వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్‌ అనిత, నస్పూర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ వెంకటేష్‌, ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లు, జిల్లా మాస్‌ మీడి యా అధికారి బుక్కం వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

జైపూర్‌ (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరు పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జైపూర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ముస్తాఫా పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ముదిగుంట గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. 65 మందికి వైద్య పరీక్షలు చేసి 18 మంది రక్తనమూనాలను సేకరించారు. అనంతరం గ్రామంలోని వీధులను పరిశీలించి కుండీలు, కూలర్లు, డబ్బాల్లో ఉన్న నీటి నిల్వలను పారబోయాలని సూచించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. వైద్యులు అశోక్‌కు మార్‌, కమలాకర్‌, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం

దండేపల్లి (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులపై విధ్యార్థులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు వహించాలని దండేపల్లి వైద్యాధికారి డాక్టర్‌ వంశీకృష్ణ, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అల్లాడి శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం దండేపల్లి కస్తూర్బా విద్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ, మలేరియా, సీజనల్‌ వ్యాధుల నివారణపై డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కేజీబీవో ఎస్‌వో భాగ్యలక్ష్మి, సీహెచ్‌వో రాజిరెడ్డి, సబ్‌ యూనిట్‌ అధికారి నాందే వ్‌, సూపర్‌వైజర్లు వసంతకుమారి, ఏఎన్‌ఎంలు వి జయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 11:46 PM