Share News

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:19 PM

గ్రామపంచాయతీ ఎన్నికలను ఎన్నికల అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించేలా కృషిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులకు ఆదేశించారు.

 ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
దండేపల్లిలో ఎన్నికల పంపిణీ కేంద్రంలో అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

దండేపల్లి డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ ఎన్నికలను ఎన్నికల అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించేలా కృషిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అధికారులకు ఆదేశించారు. దండేపల్లి మండల కేంద్రంలో బుధవారం స్ధానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో ఎన్నికల నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి ఎన్నికల సామగ్రి పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులను విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావువ్వకుండా చూడాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల మౌలిక వసతులను కల్పించి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణ కేంద్రం నుంచి ఎన్నికల సిబ్బందికి అన్ని రకాల పోలింగ్‌ సామగ్రిని అందించాలన్నారు. ఓటర్ల సజావుగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ఎన్నికలను ప్రశాంత వాతవరణంలో జరిగేలా చూడాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, ఆర్డీవో శ్రీనివాస్‌రావు ఎన్నికల నిర్వహణ పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించేలా చూడాలని పలు అంశాలపై సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో దండేపల్లి మండల ఎన్నికల అధికారి జేఆర్‌ ప్రసాద్‌, తహసీల్దార్‌ రోహత్‌దేశ్‌పాండే, ఎంఈవో మంత్రి రాజు, ఎంపీవో విజయప్రసాద్‌ శ్రీనివాస్‌, జోనల్‌ ఆఫీసర్స్‌, పీవోలు, ఏపీవోలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

హాజీపూర్‌: మండలంలో నిర్వహించే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. బుధవారం హాజీపూర్‌లోని ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్‌ పర్యవేక్షించారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎన్నికలు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని, ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే ఉపసర్పంచు ఎన్నిక చేపట్టాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ చంద్రయ్య ఉన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 11:19 PM