Share News

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలి

ABN , Publish Date - Oct 01 , 2025 | 11:44 PM

రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. కలెక్టర్‌ చాంబర్‌లో బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌తో కలిసి అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 16 జడ్పీటీసీ, 129 ఎంపీటీసీ స్థానా లకు రెండు విడతల్లో, 306 సర్పంచ్‌, 2,680 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల నిర్వ హణకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నోడల్‌, రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌, ప్రిసై డింగ్‌ అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు. మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల ఆధ్వ ర్యంలో మండల స్థాయిలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసి నామినేషన్ల స్వీకరణ, ఫిర్యాదు లు, సందేహాల సంబంధిత అర్జీలను స్వీకరి స్తామని తెలిపారు.నామినేషన్ల ప్రక్రియ మొ దలైనప్పటి నుంచి ఓట్ల లెక్కింపు పూర్త య్యేంత వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందన్నారు. సభలు, సమావేశాల కోసం తహసీల్దార్‌ నుంచి అనుమతి పొందాలని సూచించారు. స్వతంత్ర అభ్యర్ధులకు అందుబాటు లో ఉన్న ఎన్నికల గుర్తులను అందించాల ని అధికారులను ఆదేశించారు. సమావేశా లు, రోడ్డు షోల్లో లౌడ్‌ స్పీకర్లను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటలోపు మాత్రమే వినియోగించాలన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే తగుచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జడ్పీ సీఈవో గణపతి, డీపీ వోవెంకటేశ్వర్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

మంచిర్యాల కలెక్టరేట్‌: రెండో సాధా రణ పంచాయతీ ఎన్నికల నిర్వ హణలో భాగంగా నస్పూర్‌లోని కలెక్టరేట్‌ సముదాయంలో హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమా ర్‌ దీపక్‌ ఒక ప్రకటనలో తెలి పారు. నామినేషన్లు, పరిశీలన, పోలింగ్‌, పోస్టల్‌ బ్యాలెట్‌, ఎన్నికలకు సంబం ధించిన ఫిర్యాదులు, సమాచారం, దరఖాస్తుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 08736- 250501 ఏర్పాటు చేశామని తెలిపారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి

హాజీపూర్‌: రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా, స్వేచ్ఛా యుత వాతావరణంలో జరిగేలా చూడాలని తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే అన్నా రు. బుధవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాల యంలో తహసీల్దార్‌, మండల ఎన్నికల ప్రవ ర్తన నియామవళి నోడల్‌ అధికారి, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం లీడర్‌ శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే మాట్లాడారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ కార్యాల యాల్లో, పబ్లిక్‌ ప్లేస్‌లలో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు ప్రచారానికి సంబంధించిన ఇతర అంశాలను తొల గించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.

ఎన్నికలకు సంబంధించిన ప్రతీ అంశంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై దృష్టి సారించి ఎన్నికల ప్రవర్తన నియామవళి అమలు చేస్తామన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్‌ మాట్లా డుతూ అందరూ సమన్వ యంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. ఎస్‌ఐ స్వరూప్‌రాజ్‌ మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగ కుండా ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఏదైన సమస్య వస్తే వెంటనే పోలీసుల దృస్టికి తీసుకరావాలన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో సాధారణ పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో శాంతియుతంగా నిర్వ హించుకుందామని దీని కోసం పోలీసుశాఖ 24 గంటలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 11:44 PM