Share News

బెల్లంపల్లి ఏరియాలో ఈడీ పర్యటన

ABN , Publish Date - Nov 24 , 2025 | 11:28 PM

బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి ఈడీ వెంకన్న, జీఎం విజయభాస్కర్‌రెడ్డితో కలిసి సోమవారం పర్యటిం చారు.

బెల్లంపల్లి ఏరియాలో ఈడీ పర్యటన
కైరిగూడ ఓసీలో వ్యూ పాయింట్‌ నుంచి పరిశీలిస్తున్న ఈడీ వెంకన్న

రెబ్బెన, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): బెల్లంపల్లి ఏరియాలో సింగరేణి ఈడీ వెంకన్న, జీఎం విజయభాస్కర్‌రెడ్డితో కలిసి సోమవారం పర్యటిం చారు. ఉదయం జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. ఏరియా స్థితిగతులపై చర్చించారు. అనం తరం కైరిగూడ ఉపరితలగని వ్యూ పాయింట్‌ నుంచి గనిని పరిశీలిం చారు. బ్లాస్టింగ్‌ పనులు చేస్తున్న మహిళ ఉద్యోగులకు అభినందించారు. వట్టివాగు రక్షణ కట్టను పరిశీలించారు. అనంతరం గోలేటి సీహెచ్‌పీకి చేరుకుని మొక్కలు నాటారు. బొగ్గు డంపింగ్‌, దుమ్ము లేకుండా చేపడు తున్న చర్యలను వీక్షించారు. రైల్వే ట్రాక్‌, వాగన్‌ లోడింగ్‌ ప్రదేశాన్ని చూసి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పీఓ నరేందర్‌, ఇంజనీర్‌ కృష్ణమూర్తి, ఎస్‌ఓటు జీఎం రాజమల్లు, వీరన్న, సీహెచ్‌పీ ఇన్‌చార్జి కోటయ్య, మేనేజర్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2025 | 11:28 PM