Share News

జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఆర్థిక లబ్ధి

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:43 PM

ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు పేర్కొన్నారు.

జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఆర్థిక లబ్ధి
సమావేశంలో మాట్లాడుతున్న సిర్పూరు ఎమ్మెల్యే హరీష్‌బాబు

- సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

మంచిర్యాల కలెక్టరేట్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణలతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని సిర్పూరు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యా లయంలో విలేకరుల సమావేశంలో బుధవారం మాట్లాడారు. గతంలో ఉన్న 5,12,18,28 శాతం జీఎస్టీ స్లాబ్‌ల్లో ఇప్పుడు కేవలం 5, 18 స్లాబ్‌ల విదానం తీసుకువచ్చి దేశ ప్రజలకు దసరా కానుకను ప్రధాని మోదీ అందించారన్నారు. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక రకాల పన్నులను తీసుకువచ్చి దేశ ప్రజలను దోచుకున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని, వారికి ప్రధాని మోదీ తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడే హక్కు లేదన్నారు. జీవిత, ఆరోగ్య బీమాపై సున్నా శాతం పన్ను, నిత్యావసర వస్తువులను ఐదు శాతం స్లాబ్‌లోకి తేవడంతో ప్రజలందరికి ఆర్థిక లబ్ధ్ది చేకూరుతుందన్నారు. ప్రజలందరూ జీఎస్టీ సంస్కరణలను వినియోగించుకోవాలన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఓ టూ వీలర్‌ షోరూంను సందర్శించి జీఎస్టీ వల్ల తగ్గిన వాహన ధరలను షోరూం సిబ్బందిని అడిగిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, నాయకులు దుర్గం అశోక్‌, ఎనగందుల కృష్ణమూర్తి, వెంకటేశ్వర్‌రావు, సత్తన్న, కమలాకర్‌రావు, శ్రీదేవి, రమేష్‌, సంతోష్‌, నాగేశ్వర్‌రావు, రామ న్న, సత్యనారాయణ, శ్రీనివాస్‌, చిరంజీవి, సత్యనారాయణ, రాజబాబు, శివ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 11:43 PM