అంబరాన్నంటిన దసరా ఉత్సవాలు
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:09 AM
జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలను ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ధర్మపురి క్షేత్రంలో ఏటా నిర్వహించే విధంగా ఉత్సవాల సందర్భంగా సాయం త్రం వేళలో లక్ష్మీ నృసింహస్వామి, వేంకటేశ్వరస్వామి వారల ఉత్సవమూర్తులను సేవలపై ఆశీనులు చేశా రు.
ధర్మపురి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలను ప్రజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ధర్మపురి క్షేత్రంలో ఏటా నిర్వహించే విధంగా ఉత్సవాల సందర్భంగా సాయం త్రం వేళలో లక్ష్మీ నృసింహస్వామి, వేంకటేశ్వరస్వామి వారల ఉత్సవమూర్తులను సేవలపై ఆశీనులు చేశా రు. అనంతరం ఆలయం నుంచి మంగళ వాయిద్యా లు వెంట రాగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రచారరథంపై స్వామి వారల సేవలను చింతామణి చెరువు గట్టు మీదుగా క్షేత్ర సమీపంలో గల నూతన జమ్మిగద్దె వరకు ఊరేగింపు జరిపారు. అనంతరం ఆలయ వేద పండితులు శమీ వృక్ష పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ పక్షాన ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్‌ఐ ఉదయ్‌కుమా ర్ గౌరవ వందనంగా తుపాకితో గాలిలోకి కాల్పులు జరిపారు. అనంతరం స్వామి వారల సేవలను ఊరే గింపు జరిపారు. ఆలయం పక్షాన స్థానిక బస్‌స్టేషన్ ఆవరణలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్య క్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ మామిళ్ల శ్రీనివాస్‌రావు, జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ సంగి సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని అన్నిగ్రామాల్లో దసరా వేడుకలు నిర్వహించారు.
- శమీ పూజలో పాల్గొన్న మంత్రి అడ్లూరి
విజయదశమి సందర్భంగా ధర్మపురి క్షేత్ర సమీ పంలో గల జంబి గద్దె వద్ద నిర్వహించిన శమీ వృక్ష పూజల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పాల్గొ ని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ముందుగా ఆయ న స్థానిక లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసు కుని పూజలు నిర్వహించారు. అనంతం స్వామి వార ల సేవను భక్తులతో కలిసి మోశారు.
- కొండగట్టులో పాల్గొన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
మల్యాల: కొండగట్టు అంజన్న సన్నిధిలో దసరా సందర్భంగా నిర్వహించిన వేంకటేశ్వరస్వామి గరుడ వాహన సేవ, శమీ పూజలలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఉత్సవమూర్తుల ఊరేగింపులో స్వామి వారిని ఎత్తుకున్నారు. అంతకు ముందు అంజన్నను దర్శనం చేసుకున్నారు. మండలంలో అన్నిగ్రామాల్లో దసరాను ప్రజలు ప్రశాం తంగా జరుపుకున్నారు. శమీ పూజలు జరిపారు. పోలీస్‌స్టేష న్‌లో ఆయుధపూజ చేశారు. ముత్యంపేటలో వేంకటే శ్వరస్వామి ఉత్సవమూర్తుల శావ కార్యక్రమంను నిర్వహించారు. పురవీధుల గుండా ఊరేగించారు.