Share News

ప్రారంభమైన దోస్త్‌ రిజిస్ట్రేషన్లు....

ABN , Publish Date - May 06 , 2025 | 12:27 AM

రాష్ట్ర వ్యాప్తం గా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్‌ సర్వీ సెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాల కిష్టారెడ్డి, కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ దేవసేన ఈ నెల 2న షెడ్యూ ల్‌ విడుదల చేశారు. ’

ప్రారంభమైన దోస్త్‌ రిజిస్ట్రేషన్లు....

-ఈ నెల 21తో ముగియనున్న గడువు

-షెడ్యూల్‌ ప్రకటించిన ఉన్నత విద్యా మండలి

-మూడు దశల్లో డిగ్రీ సీట్ల కేటాయింపు

-వచ్చేనెల 30 నుంచి ఫస్ట్‌ సెమిస్టర్‌ క్లాసులు

మంచిర్యాల, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తం గా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్‌ సర్వీ సెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ బాల కిష్టారెడ్డి, కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ దేవసేన ఈ నెల 2న షెడ్యూ ల్‌ విడుదల చేశారు. ’దోస్త్‌’ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల్లో బకెట్‌ సిస్టమ్‌, రిజ ర్వేషన్లతో ప్రవేశాలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 908 ప్రభుత్వ, పైవ్రేటు, ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లోని 3,93,467 సీట్ల కోసం తొలి దశ రిజిస్ట్రేషన్లు ఈ నెల 3 నుంచి ప్రారంభమై, మూడు విడతల్లో కొనసాగను న్నాయి. అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తికాగానే జూన్‌ 30 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్మీ డియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో మొ దటి సంవత్సరం ప్రవేశాల కోసం ’దోస్‌’్త ద్వారా దర ఖాస్తు చేసుకుంటే, మార్కుల ఆధారంగా ప్రవేశాలు చేపడతారు.

జిల్లాలో ఏడువేల సీట్లు అందుబాటులో....

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో మొత్తం 7,500 వరకు సీట్లు అందుబాటులో ఉన్నా యి. జిల్లా మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరు, బెల్లం పల్లి పట్టణాల్లో ఒక్కొక్కటి చొప్పున నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, ప్రైవేటు కళాశా లలు 15 వరకు ఉన్నాయి. డిగ్రీ స్థాయిలో అన్ని గ్రూ పుల్లో చేరేందుకు విద్యార్థులు ’దోస్త్‌’ ద్వారా దరఖా స్తులు చేసుకోవలసి ఉంటుంది. ఇందు కోసం వెబ్‌ సైట్‌ జ్ట్టిఞట://ఛీౌట్ట.ఛిజజ.జౌఠి.జీుఽ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యా ర్థులు మొదటి దశలో రూ. 200 ఫీజు చెల్లించి రిజి స్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆధార్‌ లింక్‌ ఉన్న మొబైల్‌ నం బర్‌తో ఆన్‌లైన్‌లో తమ హాల్‌ టికెట్‌ నంబర్‌ (యూ జర్‌ ఐడీ) ద్వారా లాగిన్‌ కాగానే ఆరు అంకెలుగల పాస్‌ వర్డ్‌ వస్తుంది. ఇందులో డిగ్రీలో ఉన్న ఏదైనా సబ్జెక్ట్‌ కోసం ఆప్షన్స్‌ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగా ణలోని ఎనిమిది యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ పొందేం దుకు ఈ రిజిస్ట్రేషన్‌ ఉపయోగపడుతుంది.

మూడు దశల్లో అడ్మిషన్‌ ప్రక్రియ....

మొదటి దశలో భాగంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూ ర్తికాగానే ఈ నెల 29న సీట్ల కేటాయింపు అనంత రం 30 నుంచి జూన్‌ 6వ తేదీ వరకు సెల్ఫ్‌ రిపో ర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఇక అనంతరం వెబ్‌ ఆప్షన్స్‌ ఇచ్చుకునేందుకు ఈ నెల 10 నుంచి 22 వర కు గడువు ఉంది. మూడో దశలో సీట్‌ అలాట్‌మెంట్‌ ఇదే నెల 29న ఉంటుంది. సీట్ల కేటాయింపులో వి ద్యార్థులకు అనుకూలమైన కళాశాల లేదా కోర్సు రా నిపక్షంలో తిరిగి వెబ్‌ ఆప్షన్స్‌కు వెళ్లే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇందులో భాగంగా ఈ నెల 30 నుంచి జూన్‌ 8 వరకు రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసి, జూన్‌ 9న వెబ్‌ ఆప్షన్లకు వెళ్లవచ్చు. జూన్‌ 13న సీట్ల కేటా యింపు, జూన్‌ 18 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు అవకా శం ఉంది. అలాగే మరో విడుత కూడా అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా జూన్‌ 13 నుంచి 19 వరకు రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసి, వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకొనేం దుకు అవకాశం కల్పించారు. జూన్‌ 23న సీట్ల కేటా యింపు ఉండగా, 28 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయా ల్సి ఉంటుంది. జూన్‌ 24 నుంచి 28 వరకు సీట్లు పొందిన విద్యార్థులంతా ఆయా కళాశాల్లో రిపోర్ట్‌ చే యాల్సి ఉంటుంది. జూన్‌ 30 నుంచి విద్యార్థులకు ఫస్ట్‌ సెమిష్టర్‌ క్లాసులు ప్రారంభమవుతాయి. పూర్తి వివరాల కోసం ’దోస్త్‌’ జిల్లా కో ఆర్డినేటర్‌ ఎం కు మారస్వామిని 9963104959 నంబర్‌లో సంప్రదిస్తే అడ్మిషన్‌ ప్రక్రియలో అవసరమైన సమాచారం లభిస్తుంది.

Updated Date - May 06 , 2025 | 12:27 AM