యూరియా కోసం ఆందోళన చెందవద్దు
ABN , Publish Date - Sep 17 , 2025 | 11:06 PM
రైతులు ఆందోళన చెందవద్దని, పంటలకు సరిపడే యూరియా తెప్పిస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి సురేఖ అన్నారు.
- జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి సురేఖ
హాజీపూర్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రైతులు ఆందోళన చెందవద్దని, పంటలకు సరిపడే యూరియా తెప్పిస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి సురేఖ అన్నారు. బుధవారం మండలంలోని పడ్తన్‌పల్లి పీఏసీఎస్‌లో యూరియా పంపిణీని మంచిర్యాల రూర ల్ సీఐ ఆకుల అశోక్‌తో కలిసి పరిశీలించారు. ఈ సంద ర్భంగా రైతులు యూరియా సరిపోవడం లేదని పడ్తన్ పల్లి గ్రామస్థులకే యూరియా ఇవ్వాలని, మిగితా గ్రా మాలకు ఇక్కడ యూరియా ఇవ్వవద్దని గ్రామసులు ఆందోళన చేయడంతో వారికి సర్దిచెప్పారు. ఏడీఏ క్రిష్ణ, ఎస్‌ఐ స్వరూప్‌రాజ్, ఏవో క్రిష్ణ పాల్గొన్నారు.
నస్పూర్: మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలోని సీతారాంపల్లిలోని రైతు వేదిక వద్ద బుధవారం యూరియాను పంపిణీ చేశారు. 120 మంది రైతులకు 266 యూరియా బస్తాలను అందించామని వ్యవసాయ శాఖ అధికారి మహేందర్ తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ సురిమిల్ల వేణు, ప్రాథమిక వ్యవసాయ సహకా ర సంఘం అధికారి సత్యనారాయణ, మాజీ డైరెక్టర్ ధరణి మధుకర్, వ్యవసాయ శాఖ విస్తారణాధికారి తిరుపతి, రైతులు పాల్గొన్నారు.
రైతుల పడిగాపులు
వేమనపల్లి: వేమనపల్లి మండలంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని నీల్వాయి సహకార సంఘం కార్యాలయం వద్ద యూరి యా కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్‌లో ఉండి పడిగాపులు కాచారు. మంగళవారం సహకార సంఘం కార్యాలయానికి 662 యూరియా బస్తాలు వచ్చాయి. వీటిని పంపిణీ చేసేందుకు బుధవారం అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో యూరియా బస్తాల కోసం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వెయ్యి మందికి పైగా రైతులు కార్యాలయం వద్దకు చేరుకుని క్యూలో ఉన్నారు. మండల వ్యవసాయాధికారి వీరన్న ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున 662 మంది రైతులకు యూరియా టోకెన్లను అందించారు.
తాండూర్: మండలంలోని అచ్చలాపూర్, రేచిని గ్రామాల్లో బుధవారం యూరియా కోసం రైతులు క్యూలో గోసలు పడ్డారు. మండల వ్యవసాయా ధికారులు సుమారు 28 టనన్నుల యూరియాను పంపిణీ చేశారు. పాస్‌బుక్, ఆధార్‌కార్డు ఆధారంగా ఒక రైతుకు ఒక బస్తాను అందించారు. కొంత మంది రైతులకు యూరియా దొరక్కపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. సీఐ దేవయ్య, ఎస్‌ఐ కిరణ్‌కుమార్, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.