Share News

నల్లబ్యాడ్జీలతో వైద్యుల నిరసన

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:36 PM

మహబూ బాబాద్‌ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్‌ తెలంగాణ టీచింగ్‌ ప్రభుత్వ డాక్టర్స్‌ అసోసియేష న్‌ ఆధ్వర్యంలో జీజీహెచ్‌ ఆసుపత్రి వద్ద మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరిం చి నిరసన తెలిపారు.

నల్లబ్యాడ్జీలతో వైద్యుల నిరసన
ఆసిఫాబాద్‌లో నిరసన తెలుపుతున్న వైద్యులు, సిబ్బంది

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మహబూ బాబాద్‌ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్‌ తెలంగాణ టీచింగ్‌ ప్రభుత్వ డాక్టర్స్‌ అసోసియేష న్‌ ఆధ్వర్యంలో జీజీహెచ్‌ ఆసుపత్రి వద్ద మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరిం చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడు తూ వైద్య వృత్తిపై గౌరవంతో మెలగాల్సిన సమాజంలో ఇలాంటి దాడులు జరగ డం దురదృష్టకరమన్నారు. పోలీసులు నిష్పక్షపాతం గా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాల ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:36 PM