Share News

ఆపద సమయంలో భయభ్రాంతులకు గురికావద్దు

ABN , Publish Date - May 12 , 2025 | 11:25 PM

జైపూర్‌ ఎస్టీపీపీలో పనిచేస్తున్న ఉద్యోగులు అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు భయభ్రాంతులకు గురికాకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌ సూచించారు. సోమవారం ఎస్టీపీపీలోని పరిపాలన భవనంలో పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు.

ఆపద సమయంలో భయభ్రాంతులకు గురికావద్దు
ఎస్టీపీపీలో మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్న పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది

- మంచిర్యాల డీసీపీ భాస్కర్‌

- ఎస్టీపీపీలో మాక్‌ డ్రిల్‌

జైపూర్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): జైపూర్‌ ఎస్టీపీపీలో పనిచేస్తున్న ఉద్యోగులు అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు భయభ్రాంతులకు గురికాకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, జైపూర్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌ సూచించారు. సోమవారం ఎస్టీపీపీలోని పరిపాలన భవనంలో పోలీసులు, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహెల్గాం ఉగ్రదాడి అనంతరం ఇటీవల సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల దృష్య్టా ప్రతీఒక్కరు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు తారసపడితే వారి ఆధార్‌కార్డును అడిగి పరిశీలించాలని సూచించారు. విధి నిర్వహణలో ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అస్వస్థతకు గురైనప్పుడు చేయాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ సంచల్‌సర్కార్‌, ఎస్టీపీపీ ఈడీ చెన్న కేశవుల చిరంజీవీ, జీఎం శ్రీనివాసులు, శ్రీరాంపూర్‌ సీఐ వేణుచందర్‌, ఎస్‌ఐలు శ్రీధర్‌, శ్వేత, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 11:25 PM