Share News

లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:39 PM

మండల కేంద్రంలోని రైతు వేదికలో 37 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శనివారం మంజూరు పత్రాలు అందజేశారు.

లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ
లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

దహెగాం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని రైతు వేదికలో 37 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు శనివారం మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెసరికుంట, మొట్లగూడ గ్రామపంచాయతీ భవనాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద మంజూరయ్యాయని, త్వరలోనే వాటికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. కల్వాడ, ఒడ్డుగూడ, మధ్య డబుల్‌ రోడ్డు, పీపీ రావు కాలనీ నుంచి సుర్దాపూర్‌ మధ్య బీటీ రోడ్డు మంజూరు అయ్యాయని, త్వరలో ఆ పనులు కూడా మొదలు పెడతామని తెలిపారు. పంటనష్టం జరిగిన రైతులు అధైర్యపడొద్దని అందరికీ పంట నష్టపరిహారం వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజేందర్‌, తహసీల్దార్‌ షరీఫ్‌, ఎంపీవో రవికుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుపతిగౌడ్‌, బీజేపీ నాయకులు ధనుంజయ్‌, దామోదర్‌, ప్రభాకర్‌గౌడ్‌, డైరెక్టర్‌ శ్రీనివాస్‌, శంకర్‌, శంకర్‌గౌడ్‌, సత్తయ్య, శ్రీనివాస్‌గౌడ్‌, సంజీవ్‌, సత్యం, ఇస్తారి, వనజ, రోషన్‌, వెంకన్న, సురేష్‌గౌడ్‌, రాజు, రాకేష్‌, సదయ్య, శ్రీకాంత్‌, రాజన్న, వెంకన్న, పరమేశ్‌, మల్లేష్‌, లక్మాజీ, అహ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:39 PM