Share News

కొనసాగుతున్న దండారి ఉత్సవాలు

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:54 PM

దండేపల్లి మండలం గుడిరేవులో పద్మల్‌పూరీకాకో దేవాలయంలో ఆదివాసీలు ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు.

కొనసాగుతున్న దండారి ఉత్సవాలు
సంప్రదాయబద్దంగా గుస్సాడి నృత్యాలు చేస్తున్న ఆదివాసీలు

- కాకో అమ్మవారికి నైవేద్యాలు సమర్పణ, పూజలు

- ఆకట్టుకున్న గుస్సాడి నృత్యాలు

దండేపల్లి అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలం గుడిరేవులో పద్మల్‌పూరీకాకో దేవాలయంలో ఆదివాసీలు ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. దీపావళి పండుగతో దండారీ ఉత్సావాలు ముగిస్తుండటంతో ఆదివారం ఆదివాసీలు కుటుంబ సమేతంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల నుంచే గాక మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ వివిధప్రాంతాల నుంచి వేలాది మంది ఆదివాసీ గిరిజనులు ప్రత్యేక వాహనాల్లో కాకో ఆలయానికి చేరు కున్నారు. మందుగా గుస్సాడి వేషధారణలతో డప్పుచప్పులతో నృత్యాల మధ్య గోదావరితీరానికి చేరుకుని పుణ్యస్నానం ఆచరించారు. అక్కడి నుంచి దేవాలయానికి చేరుకుని కాకో అమ్మవారిని దర్శించుకుని ఆదివాపీ సంప్రదా యబద్ధంగా దండారీ ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. అనంతరం పూజల అనంతరం ఆలయప్రాంగణంలో మహి ళలు రేలా రేలా ఆటపాటలతో నృత్యాలు చేస్తూ, గిరిజనులు గుస్సాడి వేషాదారణలతో కోలాటల నడుమ డప్పుచప్పులతో చూడముచ్చటగా నృత్యాలు, ఆటపాటలతో ప్రత్యేక భజన కార్యక్రమాలతో గిరిజనులు సందడి చేశారు.

అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

ఆదివాసీల ఆరాధ్యదైవమైన పద్మల్‌ పూరీ కాకో అమ్మవారిని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర యువ నాయ కుడు నడిపెల్లి విజీత్‌రావు దర్శించుకున్నారు. ఈసందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు గుస్సాడిలతో గిరిజన సంప్రదా యబద్ద్ధగా ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్‌పార్టీ నాయకులు తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 11:54 PM