Share News

సమన్వయంతో శాంతిభద్రతల పరిరక్షణ

ABN , Publish Date - Mar 12 , 2025 | 11:16 PM

రామగుండం పోలీసు కమిషనరేట్‌ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు.

 సమన్వయంతో శాంతిభద్రతల పరిరక్షణ
మంచిర్యాల పోలీసుస్టేషన్‌లో తనిఖీ చేస్తున్న రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

మంచిర్యాల క్రైం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రామగుండం పోలీసు కమిషనరేట్‌ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని రామగుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. బుధవారం మంచిర్యాల పోలీసు స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణ పోలీసుస్టేషన్‌లోని కేసుల వివరా లను పోలీసుస్టేషన్‌ నిర్వహణ, విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలు, రౌడీ షీటర్ల బైండోవర్లు, కౌన్సెలింగ్‌, మొదలైన విషయాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మంచిర్యాల జోన్‌ రామగుండం పోలీసు కమిషనరేట్‌లో అధికంగా విస్తరించి ఉందన్నారు. మంచిర్యాల పట్టణం పారిశ్రామికంగా అభివృద్ధి చెందు తుందన్నారు. భద్రత, పరిరక్షణ ట్రాఫిక్‌ విషయంపై అధికారులతో మాట్లాడారు. ప్రజలకు ఉత్తమమైన పారద ర్శకతో, చట్టభద్రతతో ఉత్తమ సేవలు అందించడంపై చర్చించారు. పోలీసుకమిషనరేట్‌ పోలీసుశాఖ బాధ్యతా యుతంగా ఉంటామని అందులో భాగంగా పోలీసు స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశామన్నారు. పారిశ్రామిక ప్రాంతం ఎక్కువగా ఉండడంతో రాత్రి సమయంలో డ్యూటీకి వెళ్లేవారు, ఇతర వ్యాపారాల నిమిత్తం నిత్యం తిరుగుతుంటారని వారి భద్రతకోసం ప్రతీరోజు పెట్రో లింగ్‌ నిర్వహిస్తామన్నారు. సిబ్బంది అంతా సమన్వ యంతో పనిచేస్తూ ప్రజలకు సేవచేయడానికి సిద్ధంగా ఉన్నామని సీపీ తెలిపారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, మంచిర్యాల ఎస్‌హెచ్‌వో ప్రమోద్‌రావు, మహిళ పోలీసు స్టేషన్‌ సీఐ నరేశ్‌ కుమార్‌, ట్రాఫిక్‌ సీఐ సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.

- బ్ల్లూకోల్ట్స్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

నేరాల నియంత్రణలో ప్రజలకు అందుబాటులో ఉండే బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రామ గుండం పోలీసు కమిషనర్‌ అంబర్‌కిషోర్‌ ఝా సూచించారు. రామగుండం కమిషనరేట్‌ హెడ్‌క్వార్టర్స్‌లో బుధ వారం పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ పరిధిలోని బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో చాలా వరకు పారిశ్రామిక ప్రాంతం ఉందని ఈ ప్రాంతంలో జరిగే విషయాలపై ప్రతీఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమన్వయంతో పనిచేయాలని సూచించారు. డయల్‌ 100కు కాల్‌ వచ్చినప్పుడు వేగంగా స్పందించాలని, తక్కువ సమయంలో సంఘటన స్థలానికి చేరుకొని సేవలు అందించాలని సూచించారు. ప్రజలతో బాధ్యతాయుతంగా మెలగాలని, బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెష ల్‌ బ్రాంచి ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్‌ ఏసీపీ ప్రతాప్‌, బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్‌, వర్టికల్‌ ఇన్‌చార్జిలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 11:16 PM