స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:26 PM
స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాటాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీపీసీసీ ఇన్‌చార్జి రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గ డ్డం వినోద్‌తో కలిసి మాట్లాడారు.
- రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్
బెల్లంపల్లి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాచాటాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీపీసీసీ ఇన్‌చార్జి రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గ డ్డం వినోద్‌తో కలిసి మాట్లాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకు లందరూ కలిసి కట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చా రు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికి పదవులు వెతుక్కుంటూ వస్తాయని ఎవరు కూడా నిరుత్సాహం చెందవద్దని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం మండల, జిల్లా స్థాయి కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియపై దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, నియోజకవర్గంలోని కార్యకర్తలు, పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్‌లకు పెద్దపీట
మందమర్రిటౌన్: రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రణాళికలు రూపొందించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్ తెలిపారు. శనివారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద సంస్థాగత ఎన్నికలకు సంబంధించి నాయకులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడే వారికి గుర్తిం పు ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయ న్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నారన్నారు. నాయకులు, కార్యకర్తలు ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పార్టీకి అంకిత భావంతో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు.
మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్ మాట్లాడు తూ పార్టీని మరింత పటిష్టం చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం నాయకులు, కార్యకర్త లు కృషి చేయాలన్నారు. అనంతరం అనిల్‌కుమార్ యాదవ్‌ను నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు సొత్కు సుదర్శన్, నోముల ఉపేందర్‌గౌడ్, బండి సదానందం, రఘునాధ్‌రెడ్డి, రాజు, విజయ, లక్ష్మణ్, ఇసాక్, జావేద్‌ఖాన్, గణేష్, శ్రీనివాస్, రజనీ తదితరులు పాల్గొన్నారు.