Share News

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది

ABN , Publish Date - Jun 25 , 2025 | 10:19 PM

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు. 1975లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది
మంచిర్యాలలో నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు. 1975లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌గౌడ్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి ప్రతిపక్ష నాయకులను జైలులో బంధించారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. 11 సంవత్సరాల మోదీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను మోదీ అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, పురుషోత్తం, మల్లారెడ్డి, ఏమాజీ మున్నారాజాసిసోడియా, అశోక్‌, సతీష్‌రావు, అశోక్‌వర్ధన్‌, కృష్ణమూర్తి, తిరుపతి, మధు, గురువయ్య, ముకేష్‌గౌడ్‌, శ్రీనివాస్‌, ప్రభాకర్‌, శ్రీనివాస్‌, శ్రీదేవి, వెంకటరమణ, రఘునందన్‌, సుజాత, కిషన్‌, సుధాకర్‌రావు, లచ్చన్న, రాజ్‌కుమార్‌, రమేష్‌, స్వామిరెడ్డి, రవిగౌడ్‌, శ్రీపాల్‌, ఠాకూర్‌సింగ్‌, రామన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 10:19 PM