Share News

ఓటరు జాబితాను సరిపోల్చండి

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:54 AM

రాష్ట్రంలో 2002-2025 సంవత్సరాల ఓటరు జాబితాలను సరి పోల్చాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్నీ జిల్లాల అధికారులు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఓటరు జాబితాను సరిపోల్చండి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2002-2025 సంవత్సరాల ఓటరు జాబితాలను సరి పోల్చాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్నీ జిల్లాల అధికారులు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2002, 2025 ఓటరు జాబితా సరిపోల్చటంలో రెవిన్యూ గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని పరిశీలించాలని తెలిపారు. జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలను సరి చూడాలని, నూతనంగా నియమించబడిన బూత్‌ స్థాయి అధికారులకు తగు శిక్షణ అందించాలన్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు తమ పరిఽధిలోని సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు పోలింగ్‌ కేంద్రాల పరిధిలని కేటాయించాలని ప్రతి సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తన పరిధిలోని పోలింగ్‌ కేంద్రాల సూపర్‌ వైజర్లకు కేటాయించాలని తెలిపారు. వారంతం లోగా కంట్రోల్‌ టేబుల్‌ మ్యాపింగ్‌, డాటా మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వివరాలను గోప్యంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారని, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తామన్నారు.

స్వచ్ఛతలో ఆదర్శంగా నిలవాలి

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రతీ గ్రామ పంచాయతీ, ప్రతీ పట్టణం స్వచ్ఛతలో ఆదర్శంగా నిలువాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు జరుగనున్న స్వచ్ఛహీసేవా 2025 కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్వచ్ఛ కార్యక్రమాలు సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 వరకు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జరుగనున్న కార్యక్రమాల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. పరిశుభ్రతను తమ వ్యక్తిగత సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డీపీవో భిక్షపతిగౌడ్‌, డీఎల్‌పీవో హుమర్‌ హుస్సెన్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 12:54 AM