ఓటు చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణ
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:46 PM
ప్రతీ సంవత్సరం చేపట్టే చీరల పంపిణీ కార్యక్రమాన్ని నవంబరు నెలలో చేపడతామని డీసీసీ అద్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు.
- నవంబరులో చీరల పంపిణీ
- డీసీసీ అధ్యక్షురాలు సురేఖ
మంచిర్యాల క్రైం, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రతీ సంవత్సరం చేపట్టే చీరల పంపిణీ కార్యక్రమాన్ని నవంబరు నెలలో చేపడతామని డీసీసీ అద్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అనారోగ్య కారణాల వల్ల చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరగలేదని, నవంబరు నెలలో రఘుపతిరావు ట్రస్టు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మహిళలందరికి చీరల పంపిణీని చేపడతామని అన్నారు. ఓటు చోరీ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గంలో 1 లక్షా 50 వేల సంతకాల సేకరణ చేపడతామన్నారు. ఓటు చోరీతో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిందన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు చిట్ల తిరుపతి, తాజా మాజీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.