kumaram bheem asifabad- చిన్నారి పెళ్లి కూతుళ్లు
ABN , Publish Date - Aug 19 , 2025 | 10:58 PM
బడిలో బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సి న పుత్తడి బొమ్మలకు మూడుమూళ్ల బంధనాలు వేసి వారి భవితను ఎండవావిగా మార్చుతున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలు, అవగాహనలోపం, నిరక్షరాస్యత బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి.
- అవగాహన కల్పిస్తున్నా కొనసాగింపు
- బాల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు
బడిలో బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సి న పుత్తడి బొమ్మలకు మూడుమూళ్ల బంధనాలు వేసి వారి భవితను ఎండవావిగా మార్చుతున్నారు. తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలు, అవగాహనలోపం, నిరక్షరాస్యత బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మారుమూల గ్రామాల్లో వివిధ కారణా లతో బాల్యవివాహాలు జరుగుతున్నాయి. కేవలం అవగాహన లోపం, అనాలోచిత నిర్ణయాలతో పెళ్లిళ్లు చేస్తున్నట్టు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. హాయిగా తోటి విద్యార్థులతో చదువుకోవాల్సిన వయస్సులో మూడుమూళ్ల బంధంతో భవితకు అడ్డుకట్ట వేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చినా జిల్లాలో ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తునే ఉన్నాయి. తమ పిల్లలకు మంచి సంబంధం చూసి మూడుముళ్లు వేయించి తమ బాధ్యత తీర్చుకోవాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఇదే క్రమంలో తొందరపడి వివాహం చేస్తున్నారు. ఎక్కువగా అమ్మాయిల విషయంలోనే వివాహాలు జరుగడంతో భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని వైద్యు లు హెచ్చరిస్తున్నారు. వీటిని నియంత్రించాలని అధికారులు చెబుతున్నారు.
- పుట్టబోయే బిడ్డకు..
బాల్య వివాహాలు చేయడం వల్ల ఆరోగ్య పరం గా తల్లికి పుట్టబోయే బిడ్డకు ఎంతో నష్టమని వైద్య నిపుణులు ఒకవైపు చెబుతునే ఉన్నారు. మరో వైపు కొన్ని చోట్ల బాల్య వివాహాలనే కొన సాగిస్తున్న నేపథ్యంలో సమగ్ర శిశు సంరక్షణ శాఖ వీటికి అ డ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుం టోంది. సమాచారం మేరకు పెళ్లిళ్లను నిలిపివే స్తున్నారు. వఽధూవరుల కుటుంబాలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఏళ్లుగా సభలు, సమావే శాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక అవగాహన సదస్సుల్లో స్వచ్ఛంద సంస్థలు బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని చెబుతున్నా జరిగే అనర్థాలు మాత్రం అగడంలేదు. అడపిల్లే కదా తొం దరగా పెళ్లి చేస్తే ఓ పనై పోతుందని కొందరు ఆలోచిస్తూ పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ప్రస్తుతం శ్రావ ణమాసం కావడంతో జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో బాల్యవివాహాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ట్లు అధికారులకు సమాచారం రావడంతో వాటిని అడ్డుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సంక్షే మశాఖ పరిధిలోని ఉన్నతాధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ ఉ ద్యోగులు గ్రామాల్లో బాల్యవివాహాలు జరుగకుండా దృష్టి సారిస్తున్నారుజ
- మూడేళ్లుగా..
జిల్లాలో మూడేళ్లుగా ఆయా మండలాల్లో అవగా హన సదస్సులు నిర్వహించడంతో పాటు బాల్య వివాహాలను అడ్డుకున్న సంఘటనలు చోటు చేసు కున్నాయి. జిల్లాలో 2023లో 18, 2024లో 15, 202 5లో ఇప్పటి వరకు 13 బాల్య వివాహలను అధికా రులు అడ్దుకున్నారు. మూడేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా 300లకు పైగా అవగాహన సదస్సులు నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల తలెత్తే అనా ర్థాలను ప్రజలకు అవగాహన కల్పించారు. కాగా బాల్య వివాహాలను అడ్దుకునేందుకు ప్రభుత్వం గతేడాది ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నంబర్లు 1098, 181, 100లతో పాటు సమీప ప్రాంతంలో పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదు చేయ వ చ్చు. సమాచారం అందిన వెంటనే అదికారులు అక్కడికి చేరుకొని బాల్య వివాహాలను అడ్డుకుని కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తారు.
ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం:
- బూర్ల మహేష్, డీసీపీవో, ఆసిఫాబాద్
జిల్లాలో బాల్యవివాహాలను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. బాల్య వివాహల మూలంగా ఏర్పడే అనర్థాలతో పాటు కేసులు వివ రాలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. బాల్య వివాహాల సమాచారం అందించే వారి వివ రాలు గోప్యంగా ఉంచు తాం. బాల్య వివాహాలు కొనసాగకుండా సహకారం అందించాలి.